Sivaji : 14 ఏళ్ళ తర్వాత రిపీట్ కాబోతున్న హిట్ పెయిర్!

Sivaji : టాలీవుడ్ హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు దశాబ్దాల పాటు హీరోగా పలు చిత్రాలతో అలరించిన శివాజీ కొన్నేళ్లుగా సినిమాలకు దూరమై రాజకీయాల్లో బిజీ అయిన విషయం తెలిసిందే. అయితే అక్కడ వర్కౌట్ అవకపోవడంతో తిరిగి సినిమా ఇండస్ట్రీకి వచ్చేసాడు. కానీ అంతగా అవకాశాలు రాలేదు. ఇలాంటి టైం లోనే లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 7 రియాల్టీ షోలో భాగమయ్యే అవకాశం వచ్చింది. ఆ షో లో తన ఆటతీరుతో ఆడియన్స్ ని మెప్పించడమే కాకుండా సీజన్ లో టాప్ 3 గా నిలిచాడు. అంతే కాదు బిగ్ బాస్ ద్వారా శివాజీ 2.0 గా సరికొత్తగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించాడు. ఇక ఆ వెంటనే మళ్ళీ సినిమాల్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక రీసెంట్ గా “90స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ” వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులని మెప్పించాడు శివాజీ. ఇదిలా ఉండగా తాజాగా ఓ హీరోయిన్ తో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు శివాజీ.

After 14 years Shivaji - Laya will act together

14 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ తో స్క్రీన్ షేర్..

ఇక శివాజీ బిగ్ బాస్ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అవుతుండగా, ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్న కుర్మ నాయకి లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక తాజాగా మరో సినిమా గురించి అప్డేట్ వచ్చింది. శివాజీ మెయిన్ లీడ్ గా సుధీర్ శ్రీరామ్ అనే కొత్త దర్శకుడితో శివాజీ ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఆ సినిమాలో తనతో పాటు పలు సినిమాల్లో నటించిన సీనియర్ హీరొయిన్ తో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఆ హీరోయిన్ ఎవరో కాదు “లయ”(Laya). శివాజీ – లయ ది హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో ఇంతకు ముందు మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి హిట్ సినిమాల్లో జోడిగా నటించారు.

- Advertisement -

త్వరలోనే సెట్స్ పైకి సినిమా..

చివరగా శివాజీ నటించిన బ్రహ్మలోకం టు యమలోకం లో నటి లయ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వగా, మళ్ళీ 14 ఏళ్ళ తర్వాత ఈ హిట్ పెయిర్ రిపీట్ కానుందని సమాచారం. ఇక లయ – శివాజీ నటించబోయే ఈ సినిమాను సెప్టెంబర్ లో ప్రారంభిస్తారని సమాచారం. ఇక పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన లయ మళ్ళీ సినిమాల్లో బిజీ కానుంది. అలాగే ఈ సినిమా ఒక ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కనుందని తెలుస్తుంది. ఆల్రెడీ 90స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ తో ఆడియన్స్ కి చేరువైన శివాజీ, ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు