Telugu Directors: రెండు సినిమాలు హిట్ అవ్వగానే ప్రాంతీయతత్వం, తెలుగు యువత ఇంకా మారదా.?

Telugu Directors: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమాను ఎంతగా ప్రేమిస్తారో, ఒక హీరోని ఎంతగా ఆదరిస్తారో చాలా సంవత్సరాల నుంచి ప్రూవ్ అవుతూనే వస్తుంది. అలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ కూడా చాలా గట్టిగా జరుగుతాయి. ఒకప్పుడు మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి మంచి ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉండేవి. ఇప్పుడు కూడా చాలామంది తమ హీరో గొప్ప అంటే తన హీరో గొప్ప అంటూ ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ ఉంటారు. ఎస్ ఎస్ రాజమౌళి వంటి దర్శకులు రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి నటులను కలిపి సినిమా తీసిన కూడా ఆ సినిమాలో మా హీరో క్యారెక్టర్ గొప్పగా ఉంటుంది. మీ హీరో కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే అంటూ ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు.

ఇకపోతే ఈ ఫ్యాన్ వార్స్ అనేవి ఎప్పటికీ తగ్గవు. సినిమాకి కులం మతం ప్రాంతం తేడా లేదు అని అంటూ ఉంటారు. వాస్తవానికి అది నిజం కూడా. కానీ కొంతమంది మాత్రం సినిమాకి ఇంకా ప్రాంతీయ భేదాన్ని తీసుకొస్తూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో అది మరీ ఎక్కువగా మారింది అని చెప్పాలి. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జయహో అనే సాంగ్ ను ఎస్ఎస్ రాజమౌళి కంపోజ్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు చాలామంది రచ్చ చేశారు. సీఎం కి లేఖను కూడా పంపించారు. అయితే కొంతమంది తెలంగాణ వాళ్లు కూడా కీరవాణి కి మద్దతుగా నిలిచారు.

ఇక ప్రస్తుతం తెలంగాణ డైరెక్టర్స్ అంటూ ఎలివేషన్స్ మొదలయ్యాయి. ప్రస్తుత కాలంలో తెలంగాణ సినిమా ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్ వంటి దర్శకులు మంచి సూపర్ హిట్ సినిమాలు తీస్తూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ వస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఆంధ్ర డైరెక్టర్స్ పని ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు అంతా తెలంగాణ డైరెక్టర్స్ సినిమాను ఏలుతున్నారని కొంతమంది పని పాట లేని యువత ట్విట్టర్ లో హల్చల్ మొదలుపెట్టారు.

- Advertisement -

Animal

ఇకపోతే సినిమా అనే దానికి భాషతోనే కాకుండా ప్రాంతంతో కూడా పెద్దగా సంబంధం ఉండదు. తెలంగాణ దర్శకులు అద్భుతమైన సినిమాలు తీసినా కూడా ఆంధ్రాలో ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అక్కడ ప్రేక్షకులుకు కూడా భాషతో సంబంధం లేకుండా ప్రాంతంలో సంబంధం లేకుండా సినిమాని ఆదరిస్తారు. నిజమైన ప్రేక్షకుడు ఎప్పుడు ప్రాంతంతో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా చూశానని ఆనందం మాత్రమే ఉంచుకుంటాడు. దీనికి చాలామంది తమిళ్ హీరోలని ఇక్కడ ఆదరించడమే నిదర్శనం అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు