Sharwanand: శర్వానంద్ సినిమాకి మళ్లీ సెంటిమెంట్ టైటిల్

Sharwanand: ముందుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు శర్వానంద్. అయితే ఎట్టకేలకు శర్వానంద్ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. శర్వానంద్ కెరియర్లో చెప్పుకోదగ్గ సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. శర్వానంద్ కేవలం కమర్షియల్ సినిమాలు చేయడమే కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఎంచుకోవడంలో కూడా ముందుంటాడని చెప్పొచ్చు. అలా శర్వా కెరియర్ లో వచ్చిన సినిమాలే గమ్యం, ప్రస్థానం, మళ్లీమళ్లీ ఇది రాని రోజు.

ఇకపోతే ఆ మధ్య కాలంలో శర్వానంద్ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తను లాస్ట్ గా చేసిన ఒకే ఒక జీవితం సినిమా మంచి హిట్ అయింది. ఆ సినిమాలో మదర్ సెంటిమెంట్ తో పాటు టైం ట్రావెల్ ని కూడా చూపించిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం శర్వానంద్ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. రీసెంట్ గా శర్వానంద్ నుంచి మనమే అనే సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా ఊహించిన విజయాన్ని బాక్స్ ఆఫీస్ వద్ద అందుకోలేకపోయింది.

Sharwanand

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం శర్వానంద్ యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక కొత్త సినిమాను చేస్తున్నట్లు తెలుస్తోంది. లేకపోతే ఈ సినిమాకి రేస్ రాజా అనే పేరును కన్ఫర్మ్ చేస్తున్నట్లు తెలిసింది. శర్వానంద్ సినిమాలకి ఉన్న సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుజిత్ దర్శకుడిగా పరిచయమైన సినిమాకి రన్ రాజా రన్ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది. ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేసిన సినిమాకి ఎక్స్ప్రెస్ రాజా అనే టైటిల్ పెట్టారు అది కూడా మంచి హిట్ అయింది. ఇప్పుడు యూ వీ క్రియేషన్స్ లో చేస్తున్న ఈ కొత్త సినిమాకి రేస్ రాజా అనే టైటిల్ పెట్టడం కూడా కలిసి వస్తుందని చాలామంది నమ్ముతున్నారు. అయితే దీని గురించి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు