Allu Arjun vs Pawan Kalyan : టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ – అల్లు ఫ్యామిలీ రోజురోజుకూ దూరమవుతున్నాయని అనిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు వీళ్ళు ఇక ముందు కూడా కలిసేలా లేరని అనిపిస్తుంది. కొన్నాళ్ల నుండి వీళ్ళ మధ్య మనస్పర్థలు ఉన్న మాట వాస్తవమే అయినా, ఈ ఇయర్ ఎన్నికల నుండి ఈ వివాదం పీక్స్ కి చేరింది. మెగా ఫ్యామిలీ ఓపెన్ గానే దూరంగా ఉంటున్నారు. గత కొన్ని రోజుల నుండి మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ఈవెంట్స్ లో బన్నీ ఎక్కడా కనిపించడం లేదు. పైగా ఎన్నికల తర్వాత సాయి దుర్గా తేజ్ అల్లు అర్జున్ ని అన్ ఫాలో అవడం, లేటెస్ట్ గా నిహారిక తన సినిమా ఈవెంట్ లో మెగాఫ్యామిలీలో అందరు స్టార్ హీరోల గురించి ప్రస్తావించి, మాట వరుసకైనా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గురించి చెప్పకపోవడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఓపెన్ గానే వీళ్ళు దూరమైపోయారని అంటున్నారు.
ఇప్పటి హీరోలు అడవుల్ని నరికేస్తున్నారు – పవన్ కళ్యాణ్..
ఇక మెగా – అల్లు అభిమానులు రీసెంట్ గా నెట్టింట దొరికే ఏ చిన్న అంశాన్నైనా ట్రెండ్ చేస్తూ వార్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా చేసిన కామెంట్లు అల్లు అర్జున్ ని టార్గెట్ చేసినవే అని నెట్టింట దుమారం రేగింది. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు, చూస్తుంటే అది బన్నీ ని అలాగే పుష్ప సినిమాని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. అసలు విషయమేమిటంటే.. డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా కర్ణాటకలో సీఎం సిద్దరామయ్యని కలిశారు. ఆ వెంటనే అటవీ పరిరక్షణ.. గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రల్లో హీరోలు నటించేవారు… ఇప్పుడు అడవుల్ని నరికేసి, స్మగ్లింగ్ చేసే పాత్రల్లో హీరోలు నటిస్తున్నారు అంటూ పేర్కొన్నారు.
పుష్ప రాజ్ పైనే ఘాటుగా కౌంటర్?
ఇక పవన్ కళ్యాణ్ అన్న ఈ మాటలు అల్లు అర్జున్ ని ఉద్దేశించినవే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ చేసిన పుష్ప సినిమాలో బన్నీ ఒక అడవుల స్మగ్లర్ అని తెలిసిందే. దీంతో పవన్ ఉద్దేశ్య పూర్వకంగానే అల్లు అర్జున్ మీద, అలాగే పుష్ప సినిమా మీద పవన్ కౌంటర్లు వేశారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అంటున్నారు. నిజానికి కర్ణాటకలో ఉన్న పవన్ అక్కడ, కంఠీరవ రాజ్ కుమార్ చేసిన ‘గంధగగుడి’ అనే అనే సినిమా గురించి ప్రస్తావించారు. ఆ సినిమానే తెలుగులో ఎన్టీఆర్ అడవి రాముడు పేరిట రీమేక్ చేసారు. ఇక ఆ సినిమాని ప్రస్తావిస్తూనే ఇప్పటి జెనరేషన్ లో పుష్ప సినిమాలో స్మగ్లింగ్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడని తెలుస్తుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక నెట్టింట మరోసారి మెగా వర్సెస్ అల్లు గొడవలు జరుగుతున్నాయి.