Rashmika – Vijay: విజయ్ – రష్మిక మధ్య ఇంత ఏజ్ గ్యాపా.?

Rashmika – Vijay

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ జంటలలో రష్మిక – విజయ్ దేవరకొండ జంట కూడా ఒకటి.. నిరంతరం ఈ జంట ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది.. ఛలో సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక.. అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకొని పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా క్రేజ్ అందుకుంది. యానిమల్ సినిమాతో మరింత క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం అన్ని భాషలలో కూడా నటించడానికి మక్కువ చూపుతోంది.

హీరో విజయ్ దేవరకొండ సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి భారీ విజయాలను అందుకొని టైర్-2 హీరోలలో తనకంటూ ఒక గుర్తింపుని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే గతంలో రష్మిక – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు ఈ జంటకు మంచి మార్కులే పడేలా చేశాయి. గీత గోవిందం సినిమాలో మొదటిసారి వీరిద్దరూ కలిసి నటించగా..ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.

ఆ తర్వాత రష్మిక – విజయ్ దేవరకొండ మధ్య ఉన్న బాండింగ్ చూసి వీరిద్దరూ కచ్చితంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ అప్పుడప్పుడు ఒకే చోటు ఉన్నట్టు పలు రకాల ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉండేవారు. దీంతో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఈ విషయం పై అటు విజయ్ దేవరకొండ టీం కూడా క్లారిటీ ఇచ్చినా ఈ విషయాలు మాత్రం ఆగడం లేదు.

- Advertisement -

ఇకపోతే విజయ్ దేవరకొండ – రష్మిక కి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత వుందనే విషయం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారుతోంది.. అసలు విషయంలోకి వెళ్తే.. రష్మిక – విజయ్ మధ్య దాదాపుగా ఏడేళ్ల గ్యాప్ ఉన్నట్లు కనిపిస్తోంది.. విజయ్ దేవరకొండ 1989 మే -9 న జన్మించారు. ప్రస్తుతం ఈ హీరో వయసు 34 సంవత్సరాలు. ఇక రష్మిక 1996 ఏప్రిల్ 5న జన్మించింది.. ఈమె వయసు 27 సంవత్సరాలు.. దీన్నిబట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఏడేళ్ల గ్యాప్ ఉందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే రష్మిక – విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఫ్రెండ్ గా మాత్రం భారీ పాపులారిటీ దక్కించుకుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు