Aho Vikramaarka Teaser : ‘అహో విక్రమార్క’ టీజర్ లో ఇది గమనించారా?

Aho Vikramaarka Teaser : మగధీర సినిమాలో విలన్ నటించిన బాలీవుడ్ నటుడు దేవ్ గిల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు… ఆ సినిమాతో మంచి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా హిట్ టాక్ ను అందుకోలేదు.. ప్రస్తుతం పవర్ ఫుల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.. ప్రస్తుతం దేవ్ ‘అహో విక్రమార్క’ సినిమాలో నటిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు.. ఈ టీజర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

దేవ్ ఒకవైపు వరుస విలన్ పాత్రల్లో కనిపిస్తూనే మరో పక్క హీరోగా కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు దేవ్ గిల్ హీరోగా పాన్ ఇండియా సినిమా ‘అహో విక్రమార్క’తో రాబోతున్నాడు. తాజాగా నేడు ఈ సినిమా తెలుగు టీజర్ ని రాజమౌళి విడుదల చేశారు.. ఈ టీజర్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.. ఈ టీజర్ వీడియోలో ఒక ఊరిలో జనాలను ఓ ముఠా విసిగిస్తూ ఉంటుంది.. వారిని ఇబ్బందులు పెడుతూ ఉంటుంది.. ఆ ఊరి జనాలను కాపాడే పోలీస్ ఆఫీసర్ గా హీరో నటిస్తున్నారు..

Aho Vikramaarka Teaser release
Aho Vikramaarka Teaser release

రౌడీల భరతం పట్టే ధైర్యం కల ఆఫీసర్ గా దేవ్ కనిపించబోతున్నాడు.. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా టీజర్ చూసేయండి… ఈ సినిమాలో తేజస్విని పండిట్, చిత్ర శుక్ల హీరోయిన్స్ గా నటిస్తుండగా పేట త్రికోటి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ అహో విక్రమార్క సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది.. త్వరలోనే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను ఇవ్వబోతున్నట్లు సమాచారం.. ఈ టీజర్ ను చూస్తుంటే అంతా విక్రమార్కుడు సినిమాల ఉందనే టాక్ ను కూడా అందుకుంది.. మరి ఆ సినిమాను కాపీ చేశారా లేదా అన్నది తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యాల్సిందే..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు