Aisha Sharma: ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఛాలెంజ్ స్వీకరించి దానిని నెరవేర్చి సోషల్ మీడియా ఖాతాలో వేరే హీరోయిన్లను సవాల్ చేస్తూ ఉంటారు. ఈమధ్య కాలంలో ఇదొక ట్రెండ్ అయిపోయింది అందులో భాగంగానే ఐస్ బాత్ కూడా ఒకటి.. ప్రస్తుతం శర్మ సిస్టర్స్ చేసిన ఈ ఐస్ బాత్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అందాల ఆరబోతతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తూ తాము మాత్రం గడ్డకట్టే నీటిలో చలికి వణుకుతూ అందాల ఆరబోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.. ముఖ్యంగా ఈ శర్మా సిస్టర్స్ ఇద్దరు ఏం చేసినా అది సంథింగ్ స్పెషల్ అనడంలో సందేహం లేదు. ఇటీవలే నేహా శర్మ బికినీ ధరించి ఐస్ వాటర్ చాలెంజ్ ను స్వీకరించగా.. ఇప్పుడు చెల్లి వంతు వచ్చేసింది.. నేహా శర్మ తర్వాత ఐషా శర్మ కూడా రెడ్ మోనోకినిలో గడ్డకట్టే మైనస్ డిగ్రీల చల్లని నీళ్లలోకి దూకింది.. ఐస్ వాటర్ ఆమె శరీరాన్ని కొరికేస్తుంటే తట్టుకోలేకపోయింది.
అక్కను ఫాలో అయిన చెల్లి..
బాలీవుడ్ లో బోల్డ్ అండ్ డస్కీ బ్యూటీస్ లో పేరు ఉన్న నేహా శర్మ , ఐషా శర్మ ఇద్దరూ తమ అందాలతో యువతను ఆకట్టుకుంటూ ఉంటారు. వేడెక్కించే ఫోటోషూట్లతో వీరిద్దరి బోల్డ్ ఫోటోషూట్ లు ఇంటర్నెట్లో మంటలు పెడుతున్నాయి. తాజాగా నేహా శర్మ సోదరి ఐషా శర్మ ఎరుపు రంగు బికినీలో అందాలు ఆరబోస్తూ ఐస్ వాటర్ టబ్‌లో దిగిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇంతకుముందు నేహా శర్మ బ్లాక్ బికినీ లో చల్లని నీటి టబ్ లోకి దిగిన వీడియోని షేర్ చేయగా ఇప్పుడు ఐషా కూడా తన సోదరుని ఫాలో అవుతూ.. ఆ వీడియోని షేర్ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్ కూడా ఇచ్చింది.. “ఏదైనా చేయండి కానీ అది ఆనందాన్ని కలిగించేది ఉండాలి.. నా ప్రాధాన్య జాబితాలో ఆనందం అగ్రస్థానంలో ఉంటుంది.. ఈ విషయాలు నా ఆనందాన్ని పెంపొందిస్తాయి” అంటూ క్యాప్షన్ జోడించింది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే ఐషా ఈ వీడియోలో చాలా అందంగా అద్భుతంగా కనిపించింది.
ఐషా శర్మ సినిమాలు..
శర్మ సినిమాల విషయానికి వస్తే.. 2018 లో సత్యమేవ జయతే అనే చిత్రంలో మనోజ్ వాజ్‌పేయి, జాన్ అబ్రహం లాంటి హీరోలతో కలిసి నటించింది. బాలీవుడ్లో మొదటి అరంగేట్ర చిత్రం కూడా ఇదే .. అంతకుముందు పలు మ్యూజిక్ వీడియోలలో కూడా నటించిన ఈమె ఆ వీడియోల ద్వారా అపారమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది..ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి ఫిట్నెస్ ఫ్రీక్ గా మారింది.. ప్రస్తుతం ఫిట్నెస్ స్కిన్ కేర్ ఉత్పత్తుల ప్రచారంలో కూడా ఐషా భారీ ఒప్పందాలను కుదుర్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా అభిమానులకు చేరువగా తన అందచందాలతో ఆకట్టుకుంటూ మరింత లైమ్ లైట్ లోకి వచ్చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు, వీడియో లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram