Aishwarya Arjun Reception: అర్జున్ కూతురి రిసెప్షన్ కి డేట్ ఫిక్స్

Aishwarya Arjun Reception : శాండల్ వుడ్ నటుడు అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య సర్జా, తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య వివాహం జూన్ 10 న చెన్నైలోని హనుమాన్ ఆలయంలో జరగనుంది. వీరి నిశ్చితార్థం ఇదే వేదికపై జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య, ఉమాపతి గ్రాండ్ రిసెప్షన్ కి కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు రిసెప్షన్ డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం. మరి ఏ రోజు రిసెప్షన్ జరగనుంది ? అనే విషయంలోకి వెళ్తే..

ఐశ్వర్య, ఉమాపతి రిసెప్షన్

చెన్నైలోని హనుమాన్ ఆలయాన్ని నటుడు అర్జున్ సర్జా నిర్మించారు. ఈ టెంపుల్ లోనే ఐశ్వర్య, ఉమాపతి ఎంగేజ్మెంట్ జరిగింది. జూన్ 10న ఈ జంట పెళ్లి జరిగిన తర్వాత జూన్ 14న చెన్నైలో రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. త్వరలో పెళ్లి, రిసెప్షన్‌పై అధికారిక ప్రకటన రానుంది. ఐశ్వర్య అర్జున్, ఉమాపతి అక్టోబర్ 2023లో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఇద్దరు నటులు కుటుంబ సభ్యులు హాజరైన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఆహ్వానం ప్రకారం వివాహ రిసెప్షన్ జూన్ 14న చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరగనుంది. ఆ రోజు సాయంత్రం 6:30 గంటలకు ఫంక్షన్ ప్రారంభం కానుంది. అర్జున్ సర్జా, అతని భార్య, మాజీ నటి నివేదిత అర్జున్ ఇద్దరూ భారీ ఎత్తున ఈ వేడుకను నిర్వహించనున్నారు. మరి సినిమా ఇండస్ట్రి నుంచి ఈ వేడుకకు హాజరు కానున్న సెలబ్రిటీలు ఎవవరో చూడాలి.  ഞങ്ങളുടെ ജീവിതത്തിലേക്ക് സ്വാഗതം; മരുമകനെ വരവേറ്റ് നടൻ അർജുൻ, ചിത്രങ്ങൾ

- Advertisement -

రియాలిటీ షో ద్వారా పరిచయం

రియాలిటీ షో – సర్వైవర్ తమిళ్ షూటింగ్ సమయంలో ఐశ్వర్య, ఉమాపతి ఒకరినొకరు తెలుసుకున్నారని నటుడు తంబి రామయ్య ఇటీవలి ఇంటర్వ్యూలో వివరించారు. ఈ షోను ఐశ్వర్య తండ్రి, నటుడు అర్జున్ హోస్ట్ చేయగా, పోటీదారులలో ఉమాపతి ఒకరు.

తంబి రామయ్య మాట్లాడుతూ.. “అర్జున్ సర్జా హోస్ట్ చేస్తున్న సర్వైవర్ తమిళ్ అనే టీవీ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడు ఉమాపతి, ఐశ్వర్య ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇటీవల అర్జున్ నిర్మించిన హనుమాన్ గుడిలో మా కుటుంబసభ్యులు మొదటిసారి కలుసుకున్నారు. మేము మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాము. అందుకే ఇద్దరి కుటుంబ సభ్యుల మధ్య బంధుత్వం పెరిగే దిశగా అడుగులు వేశాము” అని తెలిపారు.

ఐశ్వర్య అర్జున్ మూవీస్

ఐశ్వర్య అర్జున్ 2013లో విశాల్ నటించిన ‘పట్టతు యానై’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆమె చివరిగా తన తండ్రి అర్జున్ సర్జా ‘ప్రేమ బరహ’లో కనిపించింది. మరి పెళ్లయ్యాక కూడా ఐశ్వర్య సినిమాలలో నటిస్తుందా అనేది చూడాలి.

ఉమాపతి నట జీవితం

శిక్షణ పొందిన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన ఉమాపతి 2017లో ‘అడగపట్టదు మగజనంగాలే’ సినిమాలో తొలిసారిగా నటించారు. తంబి రామయ్య రచించి, దర్శకత్వం వహించిన ‘మణియార్ కుటుంబం’లో కూడా అతను ప్రధాన పాత్రలో కనిపించాడు. అతను చివరిసారిగా 2021లో తన్నే వండి చిత్రంతో కనిపించాడు. ఇందులో అతని తండ్రి కూడా సహాయక పాత్రలో కనిపించారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు