Aishwarya Rai: మాజీ ప్రియుడుతో ఐశ్వర్య రాయ్…ఫోటో వైరల్‌?

Aishwarya Rai: ప్రపంచ సుందరి… నటి ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ 1994లో మిస్ వరల్డ్ గా నిలిచింది. ఇక ఐశ్వర్యారాయ్ నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఈ బ్యూటీకి ఎన్నో అవార్డులు సైతం వచ్చాయి. ఇక ఈ బ్యూటీ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే అభిషేక్ బచ్చన్ అనే బాలీవుడ్ ప్రముఖ నటుడుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరికి ఒక కూతురు. గత కొన్ని రోజుల నుంచి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వైవాహిక బంధంపై ఎన్నో రకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ…. అంతేకాకుండా విడివిడిగా ఉంటున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ వార్తలపై ఈ జంట ఇప్పటివరకు స్పందించకపోవడం ఈ రూమర్స్ కు మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది. తాజాగా ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ వివాహానికి సినీ సెలబ్రిటీలు అంతా తరలివచ్చారు. ఐశ్వర్యారాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ఈ వివాహానికి హాజరయ్యారు. తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి రాలేదు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లు అయింది.

వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలు నిజమేనని తేల్చి చెబుతున్నారు. అయితే ఐశ్వర్య తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ తో కలిసి అనంత్ పెళ్లిలో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే….. వీరిద్దరూ కలిసి ఫోటోలు దిగలేదని…. ఆ ఫోటోలు మార్ఫింగ్ చేశారని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ…. ఐశ్వర్యరాయ్ తన కెరియర్ బిగినింగ్ లో కొంతమంది హీరోలతో ఎఫైర్స్ నడిపిందట. వివేక్ ఒబెరాయ్ తో ఐశ్వర్యరాయ్ రిలేషన్ కొనసాగించిందని టాక్. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం నడిపిందని వార్తలు వచ్చాయి.

- Advertisement -

Aishwarya Rai Once Supported Her Ex-Boyfriend, Salman Khan During His Rio  Olympics Controversy

సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ ను తీవ్రంగా వ్యతిరేకించాడని వార్తలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ మద్యం సేవించి ఐశ్వర్య రాయ్ తో అనుచితంగా ప్రవర్తించాడని…. ఆ కారణంగానే ఈ జంట విడిపోయారని బాలీవుడ్ సర్కిల్స్ లో టాక్. ఇక వీరిద్దరూ విడిపోయాక కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇక ఇన్నేళ్లకు ఐశ్వర్య తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ తో కలిసి సన్నిహితంగా కనిపించి షాక్ ఇచ్చింది. భర్తతో విడాకుల వార్తల నడుమ ఈ పరిణామమే మరింత ప్రాధాన్యత నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్ గురించి నెట్టింట అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు