Venky76 : ఆ విషయంలో వెంకీ తప్పు చేస్తున్నాడా? సీనియర్లకు ఉన్న సమస్యే ఇది!

Venky76 : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఇయర్ సంక్రాంతికి సైన్ధవ్ తో వచ్చి ప్లాప్ అందుకున్నా, ఆ సినిమాలో వెంకటేష్ పెర్ఫార్మన్స్ విషయంలో మార్కులు కొట్టేసాడు. స్క్రీన్ ప్లే విషయంలో ఆ సినిమా ప్లాప్ అయింది అంతే. ఇక ఆ సినిమా విషయం పక్కన బెడితే వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతుందన్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇద్దరూ ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ లే. కాబట్టి ఈ సినిమా మినిమం ఆడియన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాని నేడు పూజ కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Aishwarya Rajesh and Meenakshi Chaudhary are playing heroines in Venky76 movie

ఎక్స్ ల మధ్య ఎక్స్ కాప్ కథ?

ఇక ఈ సినిమా కథకి సంబంధించి ఆల్రెడీ హింట్ కూడా ఇచ్చేసారు మేకర్స్. రీసెంట్ గా వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ లో కథ హింట్ ఇవ్వగా, ఇందులో వెంకీ ఒక ఎక్స్ కాప్ అంటే మాజీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ‘ ఓ ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సెలెంట్ వైఫ్, ఈ ముగ్గురి మధ్య జరిగే ఓ క్రైమ్ ఎంటర్టైనర్ అని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక ఓవరాల్ గా స్టోరీ లైన్‌ ఇలా ఉంటుందని మేకర్స్ ముందే హింట్ ఇవ్వగా, పూర్తిగా వెంకటేష్ మార్క్ ఎంటర్టైనర్ గా, అనిల్ రావిపూడి స్టైల్ లో ఉంటుందని తెలుస్తుంది. ఇక దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమా (Venky76) కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించే ఛాన్స్ ఉంది.

- Advertisement -

హీరోయిన్ల విషయంలో వెంకి తప్పు చేస్తున్నాడా?

అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. వాళ్లలో ఒకరు ఐశ్వర్య రాజేష్. మరొకరు మీనాక్షి చౌదరి. ఇందులో ఐశ్వర్య వెంకీ వైఫ్ గా నటించనుండగా, మీనాక్షి మాజీ గర్ల్ ఫ్రెండ్ గా నటించనుంది. నిజానికి ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుందని అనుకున్నారు అందరూ. కానీ మేకర్స్ వీళ్ళిద్దర్నీ సెలెక్ట్ చేసి షాకిచ్చారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్లు వెంకీ కి సెట్ అవ్వరన్న టాక్ ఇండస్ట్రీ లో వినబడుతుంది. ఎందుకంటే ఇద్దరికీ వెంకీ లో సగం ఏజ్ కూడా ఉండదు. ముఖ్యంగా మీనాక్షికి వెంకీ కూతురికన్నా చిన్న వయసు. వాళ్ళను పక్కపక్కన చూసినా అలాగే కనిపిస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా నా సామి రంగ లో నాగార్జున కు కూడా ఇదే పరిస్థితి ఎదురయింది. చిరంజీవి కి కూడా హీరోయిన్ల విషయంలో సరిగా సెలక్షన్ లేదని అభిమానుల నుండే విమర్శ ఉంది. ఇప్పుడు వెంకటేష్ కి కూడా ఇదే పరిస్థితి వస్తుంది. మరి మేకర్స్ ఈ విషయంలో మరోసారి ఆలోచిస్తే బెటరని వెంకీ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు