Aishwarya Rajesh: పేరుకే హీరోయిన్.. జీవితం మొత్తం విషాదాలే..!

Aishwarya Rajesh.. కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయం చేయనవసరం లేదు.. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే 50 సినిమాలకు పైగా పూర్తి చేసి భారీ క్రేజ్ అందుకుంది.. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలోనే నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. మొదట కౌసల్య కృష్ణమూర్తి అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యింది ఐశ్వర్య రాజేష్.. తెలుగులో తక్కువ సినిమాలలో నటించినా.. కోలీవుడ్ లో మాత్రం బిజీ హీరోయిన్గా స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.

బ్యాగ్రౌండ్ ఉన్నా అవకాశాలు కష్టమే..

Aishwarya Rajesh: Heroine in name.. Life is full of tragedies..!
Aishwarya Rajesh: Heroine in name.. Life is full of tragedies..!

ప్రస్తుతానికైతే ఐశ్వర్య రాజేష్ తమిళం , కన్నడ, మలయాళం తో పాటూ ఇతర భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నది.. మరోవైపు సినీ బ్యాక్ గ్రౌండ్ భారీగానే ఉన్నా.. ఈమె మాత్రం మొదట చిన్న చిన్న పాత్రలతోనే తన కెరియర్ ను ప్రారంభించింది. ఐశ్వర్య రాజేష్ చైల్డ్ యాక్టర్ గా కూడా మొదట తన కెరీర్ ని ప్రారంభించింది.. అలా రాజేంద్రప్రసాద్ నటించిన రాంబంటు అనే సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించింది. ఐశ్వర్య రాజేష్ కూడా సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ కలిగిన హీరోయినే.. అయినప్పటికీ ఈమె జీవితం నిండా విషాదాలే ఉన్నాయి.. వాటి గురించి తెలుసుకుందాం.

తండ్రి మరణంతో జీవితం అగమ్యగోచరం..

ఐశ్వర్య రాజేష్ తండ్రి, ప్రముఖ నటుడు రాజేష్ కూడా ఒకప్పుడు తెలుగులో హీరోగా ఎన్నో చిత్రాలలో నటించారు.. దాదాపుగా 50 కి పైగా సినిమాలలో నటించారట. కానీ ఆ తర్వాత కొన్ని అనారోగ్య సమస్యల వల్ల తక్కువ వయసులోనే మరణించారు.. ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్.. ఈయన మరణం తర్వాత తన కుటుంబం చాలా కష్టాలను ఎదుర్కొందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది ఐశ్వర్య రాజేష్. తన తండ్రి కష్టాలలో ఉన్న వారికి సహాయం చేయడం వల్లే చివరికి అనారోగ్యం బారిన పడి మరణించారని తెలిపింది. అప్పుల భారం మొత్తం తన తల్లి పైన పడటంతో తనకు ఉన్న ఒక్క ఇంటిని కూడా అప్పులు తీర్చడానికి అమ్మేశారని తెలిపింది.

- Advertisement -

కష్టాలు తీరుస్తారన్న అన్నయ్యలు కూడా మరణించారు..

ముఖ్యంగా తన తల్లి మాత్రం తమని ఎలాంటి కష్టాలు లేకుండా చదివించింది.. అంతేకాదు తన అన్నయ్యలు చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగానికి వెళ్తారు అనుకున్న సమయంలో ఒక ప్రమాదంలో మరణించారని వెల్లడించింది.. దీంతో ఒక్కసారిగా మళ్లీ కుటుంబం మొత్తం దుఃఖంలోనే మునిగిపోయామని ఎమోషనల్ గా మాట్లాడింది ఐశ్వర్య రాజేష్.. వృత్తిపరంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను.. ఎన్నో అవమానాలను అనుభవించాను.. అయినప్పటికీ ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని తెలియజేసింది.. ధైర్యంగా ముందుకు అడుగు వేసి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను.. అలా ఇప్పటికి సక్సెస్ అయ్యాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది ఐశ్వర్య రాజేష్.

ఈమె మేనత్త కూడా నటే..

ఇకపోతే ఐశ్వర్య రాజేష్ మేనత్త కూడా ఒక నటే.. ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి శ్రీలక్ష్మి.. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ఈమె ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. అమ్మ, అక్క , అత్త, చెల్లి, వదిన ఇలా ఈమె పోషించని పాత్ర అంటూ లేదేమో.. ప్రతిపాత్రలో కూడా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించింది.. ఇక మేనత్త సహకారంతోనే ఐశ్వర్య రాజేష్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందని చెబుతూ ఉంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు