Aishwarya Rajesh: అతని చేతిలో దారుణంగా మోసపోయిన ఐశ్వర్య ?

 

Aishwarya Rajesh: ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ తన తండ్రి రాజేష్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలో అందం ఉంటే సరిపోదు. అందంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. ఇప్పుడు ఈ బ్యూటీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తన కెరియర్ ఆరంభంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి రెండు సినిమాల్లో నటించింది.

ఆ సినిమాలు సూపర్ సక్సెస్ అవడంతో ఈ బ్యూటీ ఫుల్ పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా ఐశ్వర్య తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్, మిస్ మ్యాచ్, టక్ జగదీష్, భూమిక, రిపబ్లిక్ నవాబ్, డ్రైవర్ మున, డియర్, ధ్రువ నక్షత్రం వంటి సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటించి…. తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఐశ్వర్య రాజేష్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

- Advertisement -

ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఐశ్వర్య రాజేష్ చేతిలో ప్రస్తుతం తమిళంలో ఏడు సినిమాలు ఉన్నాయట. అంతేకాకుండా ఇంకో నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని టాక్. ఇక తమిళంలో హీరోయిన్గా రాణిస్తున్న ఐశ్వర్య రాజేష్ తెలుగులో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. తెలుగులో అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తుందట. ఈ సమయంలోనే ఓ నిర్మాత ఐశ్వర్య రాజేష్ కు సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్సులు ఇప్పిస్తానని ఆఫర్ చేశాడట.

Aishwarya Rajesh: Heroine in name.. Life is full of tragedies..!

ఇక ఐశ్వర్య రాజేష్ కూడా ఓకే చెప్పిందట. ఆ తర్వాత ఆ నిర్మాత ఐశ్వర్య రాజేష్ కు షాక్ ఇచ్చాడట. తాను చెప్పిన విధంగా చేయాలని ….కమిట్మెంట్స్ కు ఒప్పుకోవాలని కండిషన్ పెట్టారట. ఇక ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్య రాజేష్ దానికి ఒప్పుకోనని అక్కడి నుంచే సైలెంట్ గా వెళ్ళిపోయిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు