Ajith Kumar: హాస్పిటల్లో భార్య.. షాక్ లో ఫ్యాన్స్..!

Ajith Kumar.. ప్రముఖ హీరో అజిత్ కుమార్ కోలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాస్త సమయం దొరికితే చాలు బైకు పైన దేశం మొత్తం పర్యటిస్తూ.. బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం గుడ్ బాడ్ అగ్లీ, విదా ముయర్చి సినిమాలలో నటిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్స్ శర వేగంగా జరుగుతున్నాయి.. ఇదిలా ఉండగా ప్రస్తుతం విడతలి చివరి షూటింగ్ కోసం అజర్ బైజాన్ వెళ్లిన అజిత్.. అక్కడి నుంచి హడావిడిగా చెన్నైకి తిరిగి వచ్చారు.. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లడంతో.. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఇది చూసిన అభిమానులందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. అసలు ఏం జరిగింది అంటూ ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

Ajith Kumar: Wife in hospital.. Fans in shock..!
Ajith Kumar: Wife in hospital.. Fans in shock..!

హాస్పిటల్లో షాలినీ..

అసలు విషయంలోకెళితే అజిత్ ఉన్నట్టుండి హడావిడిగా ఆసుపత్రికి వెళ్లడానికి కారణం ఆయన భార్య ప్రముఖ హీరోయిన్ షాలిని అని చెప్పాలి. ఈమె చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చిన్నపాటి సర్జరీ చేయించుకున్నారని సమాచారం.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉంది.. అయితే ఆయన తన భార్యను చూడడానికి అజర్ బైజాన్ నుంచి చెన్నై వచ్చారని.. షాలిని కోలుకున్న తర్వాత ఈయన మరోసారి అజర్ బైజాన్ లో డిలిజన్స్ షూటింగ్లో పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి బెడ్ పై ఉన్న షాలిని చేతులు పట్టుకొని ఉన్న అజిత్ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. ఇక దీంతో షాలిని త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

షాలిని సర్జరీకి కారణం ఇదే..

అసలు విషయంలోకి అయితే.. చాలా రోజులుగా షాలిని కొన్ని శారీరక సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. మరొకవైపు అజిత్ షూటింగ్లో బిజీగా ఉండడంతో షాలిని సర్జరీ సమయంలో ఆమెతోపాటు ఉండలేకపోయాడట. ఇక కొత్త సినిమా కోసం అజర్ బైజాన్ వెళ్లాల్సి రావడంతో తన భార్య సర్జరీకి అవసరమైన అన్ని పనులను పూర్తి చేసి.. అందుకు సంబంధించిన వైద్యులతో మాట్లాడి విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.. ఇక షూటింగ్ వాయిదా వేస్తే నిర్మాతలకు ఆర్థికంగా నష్టం కలుగుతుందని.. అందుకే తన భార్యకు సర్జరీ చేయాల్సి వచ్చినా.. షూటింగ్ కి వెళ్లినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి .. నివేదికల ప్రకారం అక్కడ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని …భార్యను చూడడానికి హడావిడిగా చెన్నై చేరుకున్నారట.

- Advertisement -

షాలిని కెరియర్..

షాలిని విషయానికి వస్తే .. ఈమె అందరికీ ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పాలి.. చైల్డ్ యాక్టర్ గా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత కొన్ని చిత్రాలలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత అజిత్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. ఇక వీరి వివాహం జరిగి చాలా సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు .. మొత్తానికైతే అజిత్ షాలిని జంట ఎప్పటికీ క్యూట్ గానే ఉంటుంది.. ఇలాగే ఉండాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు