Good bad ugly : అజిత్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక జాతరే..

Good bad ugly : కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ తునీవు తో సూపర్ హిట్ కొట్టిన అజిత్, ప్రస్తుతం రెండు క్రేజీ సినిమాలను ;లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా షూటింగ్ రెండు నెలల ముందే స్టార్ట్ అవగా, వరుస షెడ్యూల్స్ లో బిజీ అవుతూ నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుండగా, ఈ సినిమా కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఈ సినిమాకి సంబంధించి తాజాగా సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఇక థలా అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ అప్డేట్ వచ్చేసింది. అది కూడా మూవీ మేకర్స్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేయడం విశేషం. ఇక అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను పొంగల్ కానుకగా రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. అయితే నెటిజన్ల అభిప్రాయం ప్రకారం జనవరి 10 లేదా 11న రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక థలా అజిత్ హీరోగా నటిస్తున్న ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ కోసం పని చేసే సాంకేతిక నిపుణులను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. విజయ్ వేలుకుట్టి ఎటిటర్ గా, సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్ స్టంట్స్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. ఇక అజిత్ చివరగా తునివు సినిమాలో నటించగా, గతేడాది పొంగల్ కు ఆ సినిమాతో వచ్చి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు మరో సారి పొంగల్ రేసులో ఉండబోతున్నాడు.

Ajith Kumar's "Good Bad Ugly" Movie Release Date Fix

- Advertisement -

అదిరిపోయిన ఫస్ట్ లుక్ పోస్టర్..

ఇక తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ (Good bad ugly) మూవీ సంక్రాంతికి వస్తున్నామని అనౌన్స్ చేయడమే కాదు, ఈ అనౌన్స్ మెంట్ ని ఒక సాలిడ్ పోస్టర్ ద్వారా రిలీజ్ చేసారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ లో అజిత్‌ను మూడు విభిన్న వ్యక్తీకరణలతో చూపించారు. మొత్తానికి మూడు విభిన్న షేడ్స్‌తో అజిత్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పోస్టర్ లో అజిత్ గ్రీన్ ప్రింటెడ్ చొక్కా ధరించగా, దానిపై డ్రాగన్ ఆకారాలు ఉన్నాయి. ఇక అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఉన్నాడు. అజిత్ చేతిపై డ్రాగన్ టాటూలు, డ్రాగన్ ఆకారపు బ్రాస్‌లెట్‌ కూడా హైలైట్ గా ఉంది. మొత్తమ్మీద ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలు పెంచింది. ఇక ప్రస్తుతం అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో పాటు, మరో సినిమా విదా ముయార్చి మూవీలోనూ నటిస్తున్నాడు. మరి అజిత్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు