Akash Puri: పేరు మార్చుకున్న ఆకాశ్ పూరి.. ఇకపై ఏ పేరంటే

Akash Puri: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వారసత్వం అనేది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా పేరు సాధించిన పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు పూరి. కొందరికి ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్స్ కూడా ఇచ్చాడు. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ కూడా కొన్ని సినిమాలు చేసి హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. అని గట్టిగా మాట్లాడితే రెండు మూడు హిట్ సినిమాలు తప్ప మిగతా సినిమా లేదు ఆడలేదు.

ఇక పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు నుంచి ఆకాష్ కి నటన పై ఆసక్తి ఎక్కువ. చాలా చిన్న ఏజ్ లోనే చిరుత బుజ్జిగాడు వంటి సినిమాల్లో కనిపించాడు. ఆ తర్వాత హరిష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు పాత్రలో కనిపించాడు. బిజినెస్ మాన్ సినిమాలో కూడా కనిపించి మంచి గుర్తింపును సాధించుకున్నాడు. అయితే ఎట్టకేలకు ఆంధ్ర పోరి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఆ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ధోని సినిమా పర్వాలేదు అనిపించింది.

Akash Puri

- Advertisement -

ఆకాష్ పూరిని ఒక ప్రాపర్ హీరోగా లాంచ్ చేయడానికి మెహబూబా అనే సినిమాను తెరకెక్కించాడు పూరి జగన్నాథ్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత రొమాంటిక్ అని సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు ఈ సినిమా కూడా ఊహించని విజయాన్ని ఇవ్వలేదు. ఇక చివరిగా చేసిన చోర్ బజార్ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. ఆకాష్ ప్రాపర్ గా కష్టపడుతున్న కూడా ఒక హిట్ సినిమా కూడా ఇప్పటివరకు పడలేదు. ఇక మరో సినిమాతో ఆకాష్ ముందుకు రానున్నాడు ఆకాష్. ఇకపోతే ఆకాష్ పూరి తన పేరును మార్చుకున్నారు. ఆకాష్ పూరి కాస్త, ఆకాష్ జగన్నాథ్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవబోతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు