Akhil: ఏజెంట్ కి ఇప్పుడు ప్లస్ – తర్వాత మైనస్..?

అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న ‘ఏజెంట్’ సినిమా ఈ నెల 28న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. టీజర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆ తర్వాత పలుమార్లు రిలీజ్ వాయిదా పడటంతో నెగిటివిటీని మూట కట్టుకుంది. ఒకానొక దశలో ఈ సినిమా షూట్ ఇంకా పెండింగ్ ఉందని 28కి కూడా రిలీజ్ అవ్వటం కష్టమే అన్న రూమర్స్ కూడా వచ్చాయి. అయితే రీసెంట్ గా సినిమా యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాటంతో ‘ఏజెంట్’ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా వచ్చిన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచుతోంది. అఖిల్ యాక్షన్ యాక్షన్ ప్యాక్డ్ పర్ఫామెన్స్ తో నిండిన ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా యూనిట్ కాన్ఫిడెంట్ మరింత పెరిగింది.
‘ఏజెంట్’ సినిమాను పఠాన్ తో పోలుస్తున్నారు చాలా మంది సోషల్ మీడియాలో. రెండు సినిమాలు స్పై థ్రిల్లర్ జానర్ అవ్వటమే ఇందుకు కారణం. పఠాన్ తో పోలిక వల్ల ఏజెంట్ కి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమా గతంలో సురేందర్ రెడ్డి వంశీ కాంబినేషన్లో వచ్చిన హిట్ సినిమాల రేంజ్ లో ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి. పఠాన్ తో పోలిక వల్ల బాలీవుడ్ లో కూడా సినిమాను ప్రమోట్ చేసేందుకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. హిందీలో రిలీజ్ కి ఇంకా టైమ్ ఉండటంతో దక్షిణాదిన సినిమా రిలీజ్ అయ్యాక హిందీలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.
పఠాన్ తో పోల్చటం కొంతవరకు ప్లస్ అయినప్పటికీ అదే రిలీజ్ తర్వాత మైనస్ అయ్యే ప్రమాదం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. 1000కోట్లు కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్ పఠాన్ ని ఏజెంట్ సినిమాని కంపేర్ చేయటం వల్ల అంచనాలు తారా స్థాయికి చేరతాయి. ఒకవేళ సినిమా టాక్ కాస్త అటు ఇటుగా వచ్చినా కలెక్షన్లు పడిపోయే ఛాన్స్ ఉంది. అసలే అఖిల్ మార్కెట్ ని మించిన బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు