Akhil Akkineni: అయ్యగారు ఆదిమానవుడు లా కనిపించడానికి కారణం ఏమిటో తెలుసా.?

Akhil Akkineni: అఖిల్ అక్కినేని నీ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా కంటే ముందు అక్కినేని ఫ్యామిలీకి బాగా స్పెషల్ ఫిలిం అయినా మనం సినిమాలో క్లైమాక్స్ లో కనిపించి సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అక్కడితో అఖిల్ హీరోగా సినిమా వస్తుంది అని అనగానే చాలామందికి అంచనాలు పెరిగిపోయాయి. అఖిల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత చేసిన వరుస సినిమాలు కూడా ఫెయిల్ అవుతూ వచ్చాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి అఖిల్ కెరియర్ లో హిట్ ఖాతాను తెరిచింది.

అఖిల్ చేసిన చివరి చిత్రం ఏజెంట్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది. చాలామంది ఈ సినిమాను చూడలేకపోయారు. ఈ సినిమా ఓటీపీ రిలీజ్ కూడా ఇంకా నోచుకోలేదు. సురేందర్ రెడ్డి ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తెరకెక్కించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒక వండర్ గా మిగిలిపోద్ది అనుకున్నారు అంతా, కానీ ఊహించిన డిజాస్టర్ ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత నుంచి ఇప్పటివరకు అఖిల్ నుంచి రాబోయే సినిమా గురించి అఫీషియల్ గా క్లారిటీ కూడా రాలేదు.

Agent Trailer Out: Akhil Akkineni Looks Wildly-Intense In This Jam-Packed Action Entertainer; Watch

- Advertisement -

కొత్త దర్శకుడు పరిచయం

ఇక ప్రస్తుతం వినిపిస్తున్న కథనాలు ప్రకారం అఖిల్ ఇప్పుడు అనిల్ కుమార్ అని దర్శకుడు దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యు వి క్రియేషన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాతోనే అనిల్ కుమార్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. యువి క్రియేషన్స్ తో అనిల్ కుమార్ కి మంచి బాండింగ్ ఉంది. రీసెంట్గా విశ్వంభరా సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను కూడా డిజైన్ చేసింది ఈ దర్శకుడు. ఇకపోతే రీసెంట్ గా ఎయిర్పోర్ట్లో లాంగ్ హెయిర్ తో దర్శనం ఇచ్చాడు అఖిల్ అక్కినేని. అయితే ఇప్పుడు అఖిల్ చేయబోయే తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన చర్చలు మొదలవుతున్నాయి.

సోషియో ఫాంటసీ టచ్ లేదు

అఖిల్ తదుపరి సినిమాలో 11వ దశాబ్దానికి చెందిన గిరిజన పాత్రలో కనిపిస్తాడట. ఇది ఒక పిరియాడికల్ ఎమోషనల్ డ్రామా అని తెలుస్తుంది. అలానే వస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాకి ఎటువంటి సోషియో ఫాంటసీ టచ్ లేదు. ఇకపోతే ఈ సినిమా గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది చిత్ర యూనిట్. అఖిల్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కాబట్టి ప్రీ ప్రొడక్షన్లోనే చాలా మట్టుకు పనులు పూర్తయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీం లొకేషన్స్ వెతికే పనిలో ఉంది. ఈ సినిమా ఎక్కువ శాతం అడవులు షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తుంది. దీని గురించి ఇంకా అధికార ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు