Akira Nandan: డాన్స్ ఇరగదీసేసిన అకీరా.. వీడియో వైరల్..!

Akira Nandan.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పట్టుదల ఉన్న వ్యక్తిగా మరింత పేరు సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీ నుంచి రాజకీయాలలోకి వచ్చి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, నేడు దిగ్విజయంగా 21 స్థానాలలో తన పార్టీ జనసేన నుంచి పోటీ చేసి 21 స్థానాలలో గెలిచి స్ట్రైక్ రికార్డు క్రియేట్ చేశారు. ఇక ప్రస్తుతం సమాజంలో జరిగే పలు అంశాలపై వేగంగా స్పందిస్తూ ప్రజలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్.

Akira Nandan: Akira who danced superbly.. Video viral..!
Akira Nandan: Akira who danced superbly.. Video viral..!

పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం..

పవన్ కళ్యాణ్ వైవాహిక జీవిత విషయానికొస్తే.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. అందులో రెండవ భార్య ప్రముఖ హీరోయిన్ కం కాస్ట్యూమ్ డిజైనర్ అయిన రేణూ దేశాయ్ తో ఆయన సహజీవనం చేశారు. పెళ్లికి ముందే అకీరా నందన్ కు జన్మనిచ్చారు. అకీరా జన్మించిన తర్వాత పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఆధ్యా కు జన్మనిచ్చారు ఈ జంట. అయితే అంతా సవ్యంగా ఉందనుకునే సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్.విడిపోయారు. అనంతరం పవన్ కళ్యాణ్ సినిమాలలో బిజీ అయితే.. రేణూ మాత్రం పిల్లల్ని తీసుకొని ముంబైలో సెటిల్ అయిపోయింది. అక్కడే వారి ఆలనా పాలనా చూసుకుంటూ.. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా షేర్ చేస్తూ వస్తోంది.

అకీరా నందన్ డాన్స్ వీడియో వైరల్..

ఈ నేపథ్యంలోనే తాజాగా అకీరా నందన్ కి సంబంధించిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది .ఇందులో అకీరా ఇరగదీసాడంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్ చేస్తూ.. ఆ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

సత్యాగ్రహి సినిమా లాంచింగ్ టైంలో వీడియో..

పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ చిన్నతనంలోనే మల్టీ టాలెంట్ తో అందరిని ఆకట్టుకున్నాడు. అందుకే పవన్ వారసుడు సినిమా ఎంట్రీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమధ్య తన తండ్రి పక్కన ఎక్కువగా కనిపిస్తూ సందడి చేస్తున్న అకీరా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండడం గమనార్హం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, అకీరా చిన్నప్పటి డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా సత్యాగ్రహి సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే పవన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల ఆగిపోయింది. ఈ సినిమా లాంచింగ్ టైంలో అకిరా బంగారం మూవీ టైటిల్ సాంగ్ కి డాన్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు.

కొడుకు డాన్స్ చూసి మురిసిపోతున్న తల్లిదండ్రులు..

ఈ వీడియోలో అకీరా డాన్స్ చేస్తుంటే పవన్ – రేణు దేశాయ్ ఇద్దరు తమ కొడుకు వేసే డాన్స్ ని చూసి తెగ మురిసిపోయారు. దీన్ని చూసిన పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతూ వీడియో ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మోత్తానికైతే అకీరా నందన్ డాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు