Akira Nandan : హీరో కావలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి, కానీ అవుతాడో లేదో తెలియదు

Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే బుక్ మై షో వచ్చేసి అందరం టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే టిక్కెట్లు దొరకాలంటేనే అది సాహసం అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో ట్రాఫిక్ జాములు కూడా ఏర్పడేవి థియేటర్ నుంచి టికెట్ లైన్లు రోడ్ల వరకు వచ్చాయి. పవన్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి వరుసగా హిట్ సినిమాలు అందుకున్నాడు. ఒక సినిమా మరొక సినిమాకి సంబంధం లేకుండా ఉండేవి. అన్ని సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. ఒక మాస్ కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు వస్తున్న తరుణంలో ఒక స్టైలిష్ మేకింగ్ ని లుక్స్ ను, స్వాగ్ ను పవన్ కళ్యాణ్ ఆంధ్ర యూత్ కి పరిచయం చేశాడని చెప్పవచ్చు.

అసలు పవన్ కళ్యాణ్ అంటేనే ఆటిట్యూడ్ అని అప్పట్లో చాలా మందికి అర్థమైంది. ఆటిట్యూడ్ కూడా చాలా స్టైలిష్ గా ఉండేది.. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆయన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ చాలా మంది మార్చడం మొదలుపెట్టారు. ఇకపోతే ఖుషి సినిమా వరకు వరుస హిట్ సినిమాలను అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఖుషి సినిమా రీమేక్ అయినా కూడా అది అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఖుషి లో పవన్ కళ్యాణ్ స్టైల్ కి చాలామంది ఫిదా అయిపోయారని కూడా చెప్పొచ్చు. ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తనలో ఉన్న దర్శకున్ని కూడా బయటికి తీసాడు. అదే జానీ సినిమా. జానీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేదు. భారీ డిజాస్టర్ గా మారింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దర్శకుడుగా సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చేయలేదు.

జానీ సినిమా తర్వాత దాదాపు 10 ఏళ్ల వరకు హిట్ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరుగుతూ వచ్చింది తప్ప ఎక్కడా తగ్గలేదు. హరిష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో మరోసారి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ రికార్డును పవన్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖిరానందన్ ఎంత టాలెంటెడ్ పర్సన్ అని ఇదివరకే సోషల్ మీడియా వేదికలో ప్రూవ్ అవుతూ వచ్చింది.

- Advertisement -

అకిరా మదర్ రేణుదేశయ్ ఎప్పటికీ అప్పుడు అకీరా వీడియోస్ ను షేర్ చేస్తూ ఉంటారు. అయితే అకిరా కూడా పవన్ కళ్యాణ్ లానే సిగ్గు, బిడియంతో ఉంటాడు అని చెప్పొచ్చు. గతంలో అఖీరానందన్ పియోనో వాయిస్తున్న వీడియోస్, అలానే మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న వీడియోస్, వర్కౌట్ చేస్తున్న వీడియోస్ ఇవన్నీ కూడా రేణుదేశయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలామంది మీడియా ప్రముఖులు అకిరా నందన్ ఎంట్రీ ఎప్పుడు అని అడిగారు. అయితే అఖీరా నందన్ ఒకవేళ హీరో అవుతాను అని తను చెప్తే నేనే ముందు అందరికంటే రివీల్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే రీసెంట్ గా మై సమురాయ్ బాయ్ అని పెట్టి ఒక వీడియోను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు రేణు దేశాయ్.

ఆ వీడియోలో కర్ర సాము చేస్తూ కనిపించాడు అఖీరా. ఆ వీడియోలో కూడా ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ లో చాలా స్టైలిష్ గా ఉన్నాడని చెప్పొచ్చు. అయితే ఒక హీరోకి ఉండవలసిన లక్షణాలు అన్నీ కూడా అఖీరా లో ఉన్నాయి. కానీ అకిరా నందన్ హీరో అవుతాడా లేదనేది ఇప్పటికీ క్లారిటీ లేని విషయం. ఒకవేళ అఖీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తే ఆడియన్స్ అంతా బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు