Akira Nandan: జూనియర్ పవన్ అంటూ కామెంట్స్.. సంచలన వ్యాఖ్యలు చేసిన రేణూ దేశాయ్..

Akira Nandan.. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు హోరా హోరీగా సాగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈసారి జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాల్లో విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత తన వారసుడిగా తనయుడు అకీరాను అందరికీ పరిచయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబుకు పరిచయం చేయగా.. నిన్న ఏకంగా ప్రధాని మోడీని ఫ్యామిలీతో సహా కలిసి భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్.. ఇక అక్కడ కూడా పవన్ వెంటే ఉన్నారు అకీరా.. ఇక దీంతో అభిమానులు జూనియర్ పవన్, పిఎస్పీ2 అంటూ కామెంట్లు చేస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు.. ఇక ఈ కామెంట్ లు అకీరా నందన్ తల్లి వరకు చేరడంతో ఆమె పలు షాకింగ్ కామెంట్లు చేసింది..

జూనియర్ పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్స్.. రేణూ ఫైర్..

Akira Nandan: Junior Pawan's comments.. Renu Desai made sensational comments..
Akira Nandan: Junior Pawan’s comments.. Renu Desai made sensational comments..

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. అకిరాను జూనియర్ పవన్ కళ్యాణ్ అంటూ పిలిచిన నెటిజెన్లపై ఆమె ఫైర్ అయ్యారు.. అకీరా కు, తన తండ్రికి .. తాను జూనియర్ పవన్ కళ్యాణ్ అనిపించుకోవడం ఇష్టం లేదు.. కాబట్టి తన ఫీలింగ్ ను మీరు కూడా అర్థం చేసుకొని అకీరా నందన్ అని మాత్రమే పిలవండి అంటూ రిప్లై ఇచ్చింది రేణూ దేశాయ్.. మొత్తానికైతే కొడుకును పవన్ కళ్యాణ్ దగ్గరకు పంపిస్తోంది కానీ జూనియర్ పవన్ కళ్యాణ్ అంటే మాత్రం ఈమె ఓర్వడం లేదు అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అఖీరా నందన్ డెబ్యూ మూవీ..

మరొకవైపు అకీరా నందన్ డెబ్యూ మూవీపై కూడా స్పందించింది. అకిరా పుట్టిన క్షణం నుంచి నేను అతడికి పెద్ద అభిమానిని.. అతడు ఎప్పుడెప్పుడు నటిస్తాడని నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అయితే మ్యూజిక్ పైన ఎడిటింగ్ మీద మాత్రమే ఆసక్తి ఉంది.. నటుడిగా ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన లేదు.. దయచేసి ఆయన ఆలోచనలను కూడా గౌరవం ఇవ్వండి అంటూ కోరింది రేణు దేశాయ్.. ఇక ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

రేణూ దేశాయ్ వైవాహిక జీవితం..

బాగా రేణు దేశాయ్ విషయానికి వస్తే.. జానీ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. వివాహానికి ముందే అతనితో అకిరా నందన్ కు జన్మనిచ్చింది.. వివాహంతో ఒక్కటైన ఈ జంట ఆ తర్వాత ఆధ్యా కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.. విడాకుల తర్వాత రేణు దేశాయ్ పిల్లలిద్దరిని తీసుకొని ముంబైలో సెటిల్ అవ్వగా.. పవన్ కళ్యాణ్ మాత్రం రష్యాకు చెందిన అన్నా ను వివాహం చేసుకున్నారు.. ఈమెకి కూడా పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే..ఇటీవలే పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు.. జనసేన పార్టీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక పార్టీగా తీసుకొచ్చి తాజాగా డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో మెగా కుటుంబంలోనూ.. ఇటు అభిమానులలోనూ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు