Renu Desai: సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చిన అకిరా, ఆద్య.. పవన్ కు స్పెషల్ విషెస్ తెలియజేసిన రేణు దేశాయ్..!

Renu Desai: నేడు ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పీఎం మోడీతో సహా అనేకమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నేడు ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో.. మెగా ఫ్యామిలీ అంతా ఆ వేడుకలో పాల్గొంది.

ఇక పవన్ పిల్లలు అకిరా నందన్ అండ్ ఆద్య కూడా తమ తండ్రి ప్రమాణ స్వీకారం చూడడానికి గన్నవరం వెళ్లారు. అయితే ప్రమాణ స్వీకారానికి అఖీరా అండ్ ఆధ్యా సాంప్రదాయంగా పద్ధతిగా రెడీ అయ్యారు. అకిరా పంచ కట్టుకోగా ఆధ్యా పద్ధతిగా పంజాబీ డ్రెస్ ధరించింది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

అకిరా అండ్ ఆధ్యా ఇద్దరూ ప్రమాణ స్వీకారానికి చక్కగా రెడీ అయ్యి రేణు దేశాయికి వీడియో కాల్ చేశారు. రేణు తన పిల్లల ఫోటో షేర్ చేసి.. నా పిల్లలు వాళ్ళ నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారికి.. ఏపీ స్టేట్ కి.. ప్రజలకు మంచి చేయాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్న.. అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రజెంట్ రేణు దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు