Akkineni Nagarjuna: అభిమానికి బహిరంగంగా సారీ చెప్పిన నాగ్… ఇష్యూ ఏంటంటే?

Akkineni Nagarjuna: తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరించినందుకు మరే ప్రేక్షకులు ఆదరించారు అనేది వాస్తవం. ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలామంది బ్యానర్లు కట్టి పాలాభిషేకం చేసి దేవుడులా వాటి ముందు కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. దాదాపు దేవుళ్లను పూజించిన మాదిరిగానే చాలామంది హీరోలను పూజిస్తూ ఉంటారు. ఇంకా ఓపెన్ గా మాట్లాడితే దేవుళ్ళ గురించి అయ్యే ఫ్యాన్వర్స్ కంటే హీరోల గురించి ఎక్కువ ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి.

Akkineni Nagarjuna

ఇకపోతే చాలామంది సెలబ్రిటీలతో ఫోటోలు దిగడానికి ఆరాటపడుతూ ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రీసెంట్ గా అక్కినేని నాగార్జున ఎయిర్పోర్టులో దర్శనమిచ్చారు. అయితే అక్కడున్న సిబ్బందిలో ఒకతను నాగార్జునతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఫోన్ పట్టుకొని నాగార్జునకు దగ్గరవుతున్న టైంలో నాగర్జున బాడీగార్డ్ తనను పట్టుకొని పక్కకు తోసేసాడు. అయితే ఆ వ్యక్తికి ఏమీ కాలేదు కానీ దాదాపు పడిపోయినంత పని అయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

ఈ తరుణంలో ఆ వీడియో నాగార్జున దృష్టికి కూడా చేరింది. ఆ వీడియోని చూసిన నాగార్జున నేను ఆ జెంటిల్మెన్ కి క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటాను అంటూ ట్విట్టర్ వేదికగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు నాగార్జున. ఇకపోతే రీసెంట్ గా నా సామిరంగానే సినిమాతో మంచి హిట్ అందుకున్నారు నాగ్. నాగార్జున తదుపరి సినిమా కూడా మళ్లీ సంక్రాంతికి రానున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు