Akshay Kumar : దీపావ‌ళికి

బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్, స‌త్య‌దేవ్‌, జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్ ప్ర‌ధాన తారాగానం రూపొందించిన చిత్రం రామ‌సేతు, ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. దీపావ‌ళి పుర‌స్క‌రించుకుని అక్టోబ‌ర్ 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న‌ది. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

ఈ త‌రుణంలో ఈ చిత్ర బృందం ఉత్కంఠ‌గా ట్రైల‌ర్‌ని మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ఇక ఈ ట్రైల‌ర్ ప్ర‌కారం.. రామ‌సేతును ర‌క్షించేందుకు అక్ష‌య్ కుమార్ ప్ర‌య‌త్నిస్తున్నట్టు చూపించారు. అక్ష‌య్‌కి స‌త్య‌దేవ్, జాక్వ‌లిన్ స‌హ‌క‌రిస్తున్న‌ట్టు ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ఈ ట్రైల‌ర్‌లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు నిర్మాత‌లు. అక్ష‌య్‌కుమార్ ఇందులో ఆర్కియాల‌జిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అభిషేక్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి డానియేల్ బి జార్జ్ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు. నిర్మాత‌లైన‌టువంటి అరుణ భాటియా, విక్ర‌మ్ మ‌ల్హోత్ర‌ల‌కు మంచి లాభాలు తీసుకొచ్చేట్టు క‌నిపిస్తుంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రి అభిమానుల అంచనాకు త‌గ్గ‌ట్టు ఆక‌ట్టుకుంటుందో లేదో తెలియాలంటే మాత్రం అక్టోబ‌ర్ 25 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు