Alanati Ramachandrudu : రిలీజ్ డౌటే… ఇంకా రాలేని సెన్సార్ సర్టిఫికెట్?

Alanati Ramachandrudu : టాలీవుడ్ లో ఈ వారం అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. కాగా అందులో “అలనాటి రామచంద్రులు” అనే చిన్న సినిమా కూడా ఒకటి. యంగ్ హీరో కృష్ణ వంశీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మోక్ష అనే అమ్మాయి హీరోయిన్ గా నటించింది. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘అలనాటి రామచంద్రుడు’ సినిమాను చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించడం జరిగింది. ఇక ఈ సినిమాను హైనివా క్రియేషన్స్ బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించడం జరిగింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ అలాగే ప్రోమోలు ఆకట్టుకోగా ఫైనల్ గా ఆగస్ట్ 2న సినిమా రిలీజ్ కి రెడీ అవుతుందనగా, తాజాగా ఈ సినిమా గురించి షాకింగ్ అప్డేట్ తెలిసింది.

Alanati Ramachandrudu movie still not get censor certificate?

సెన్సారే రాలేదు.. రిలీజ్ డౌటే?

ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రేపు థియేటర్లలో రిలీజ్ అవుతుంది అనుకున్న అలనాటి రామచంద్రుడు (Alanati Ramachandrudu) సినిమా కి సంబంధించి తాజాగా ఓ సమాచారం అందింది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికెట్ కూడా రాలేదట. రిలీజ్ కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న క్రమంలో సినిమా బయ్యర్లు కంగారు పడుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం రాత్రికి రాత్రి కూడా సెన్సార్ సర్టిఫికెట్ రావడం కష్టమని, కుదిరితే ఒకరోజు వాయిదా వేసే అవకాశం ఉందని, లేదంటే మరో వారం వాయిదా వేసి నెక్స్ట్ వీక్ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

- Advertisement -

వాయిదా పడితే ఉన్న హైప్ కూడా పోతుందా?

ఇక రేపు రిలీజ్ కాబోతున్న అలనాటి రామచంద్రుడు సినిమా కి సంబంధించి ఈ న్యూస్ వస్తుందని ఎవరూ అనుకోలేదు. మరి చిత్ర యూనిట్ ఈ విషయంలో క్లారిటీ ఇస్తే మంచిదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అనుకోకుండా వాయిదా పడితే ఇప్పుడు ఉన్న కాస్త హైప్ కూడా తగ్గిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరో ఒక ఇంట్రోవర్ట్‌ ప్రేమికుడిగా నటించగా, తన ప్రేమ వల్ల అతని లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది సినిమా స్ట్రోరి గా మలిచారని తెలుస్తుంది. మరి ఆగష్టు 2న థియేటర్లలో అలనాటి రామచంద్రుడు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది మరి కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు