Alia Bhatt : తొలిసారి అలా !

బాలీవుడ్ లో ఈ ఏడాది కొన్ని ప్రేమ జంటలు ఒకటి అయ్యాయి. అందులో ఆలియా భట్ – రణ్ బీర్ కపూర్ జంట ఒకటి. చాలా రోజుల పాటు ఈ ప్రేమ పక్షులు పెళ్లి విషయాన్ని దాచుతూ వచ్చి, చివరికి ఈ సంవత్సరం పెళ్లి పీటలెక్కారు. అంతే కాకుండా ఇటీవల ఆలియా భట్.. తాను ప్రెగ్నెన్సీ అంటూ శుభవార్తను కూడా షేర్ చేసింది. ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ముందుగా కమిట్ మెంట్ ఇచ్చిన సినిమాల షూటింగ్ లను, వాటి ప్రమోషన్ లలో యాక్టివ్ గా పాల్గొని అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ క్రమంలో ఆలియా భట్ తన బేబి బంప్ ఎక్కడా కనిపించకుండా పొడవాటి దుస్తులు ధరించింది.

తాజాగా ఆలియా భట్ తన బేబి బంబ్ కనిపించేలా దుస్తులు ధరించి మీడియా ముందుకు వచ్చింది. బ్రహ్మస్త్ర ప్రమోషన్స్ లో భాగంగా ఒక సాంగ్ ప్రివ్యూ లాంచ్ కోసం భర్త రణ్ బీర్ కపూర్ తో వచ్చింది. అప్పుడే తన బేబి బంబ్ కనిపించింది. అలాగే మీడియాకు ఫోజులు కూడా ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

కాగా, దీనికి ముందు డార్లింగ్ సినిమా ప్రమోషన్స్ లో ఆలియా భట్ ఒంటరిగా పాల్గొంది. అప్పుడు ఆలియా బేబి బంబ్ ను కనబడకుండా డ్రెస్ ధరించింది. కానీ, భర్తతో బ్రహ్మస్త్ర ప్రమోషన్స్ కు వచ్చిన సమయంలో మాత్రం బేబి బంబ్ హైలైట్ అయ్యేలా డ్రెస్ ధరించి అందరిని ఆశ్చర్యపరిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు