BachhalaMalli Glimpse : ఎవ్వడికోసం తగ్గడట ఈ ‘బచ్చలమల్లి’…

BachhalaMalli Glimpse : టాలీవుడ్ కామెడీ కింగ్ అల్ల‌రి న‌రేష్ ప్రస్తుతం కామెడీ సినిమాల కన్నా సీరియస్ డ్రామాలు ఎక్కువగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు తన ఎంటర్టైన్మెంట్ మూవీస్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన ఈ అల్లరోడు ఇప్పుడు తన రూటు మార్చి డిఫరెంట్ జోనర్ లలో సీరియస్ డ్రామాలు తీయడం మొదలు పెట్టాడు. కామెడీ సినిమాలు ప్లాప్ అవుతుండడం వల్ల, ఇప్పుడు తన పంథా మార్చి అల్లరి నరేష్ యాక్షన్ డ్రామాలు తీస్తున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో నాంది, ఉగ్రం సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన అల్లరి నరేష్, రీసెంట్ గా నా సామిరంగా సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుబ్బు మంగదెవ్వి ద‌ర్శ‌క‌త్వంలో హాస్యా మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా కనిపిస్తుంది. కాగా లేటెస్ట్ గా అల్లరి నరేష్ బర్త్ డే కానుకగా కాసేపటికిందే “బచ్చల మల్లి” (BachhalaMalli Glimpse) గ్లిమ్ప్స్ రిలీజ్ కావడం జరిగింది.

Allari Naresh BachhalaMalli Movie Glimpse Out Now

ఎవ్వడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి..

ఇక అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చల మల్లి సినిమా గ్లింప్స్ కాసేపటికిందే యూట్యూబ్ లో రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా బచ్చలమల్లి తెరకెక్కించడం జరిగింది. ఇక బర్త్ డే టీజర్ లో అల్లరి నరేష్ ఈ సినిమా కోసం సాలిడ్ మేకోవర్ చేసాడని తెలుస్తుంది. చాలా రా & రస్టిక్ గా అల్లరి నరేష్ టీజర్ లో కనిపించగా, ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో క్రేజీ రెస్పాన్స్ తెచ్చుకోగా, ఇప్పుడు గ్లింప్స్ తో మరింత హైప్ ని పెంచేశారు సినిమాపై. ఇక టీజర్ లో అల్లరి నరేష్ మెల్లిగా ఇంట్లోంచి బయటికి వచ్చి బయట పెట్టిన సౌండ్ సెట్ పీకి పడేస్తాడు. ఆ తర్వాతి షాట్ లో మందు బాటిల్ ని గ్లాసులో పోసుకుంటూ, చేసే ఫైట్ షాట్స్ వేరే లెవెల్ లో గూస్బంప్స్ తీసుకొచ్చాయి. ఎవ్వడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి అంటూ ఆటిట్యూడ్ చూపిస్తూ డైలాగ్ చెప్తుంటే, వెనకాల వచ్చే బీజీఎమ్ ఎక్స్ట్రార్డినరీ గా ఉంది.

- Advertisement -

సాలిడ్ హిట్ వచ్చినట్టే!

ఇక బచ్చలమల్లి టీజర్ లో మెయిన్ గా అల్లరి నరేష్ లుక్ కానీ తన బాడీ లాంగ్వేజ్ చాలా బాగున్నాయి. బచ్చల మల్లి గా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిపోయాడు. ఇక ఈ గ్లింప్స్ లో విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన బీజీఎమ్ సూపర్ గా ఉంది. ఈ సినిమాతో అల్లరి నరేష్ కం బ్యాక్ ఇవ్వడం ఖాయంగా ఉంది. ఇప్పటికే బచ్చలమల్లి సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకోగా, సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక ఫస్ట్ లుక్ వచ్చినపుడే సినిమాలో హీరో ఇంటి పేరు బచ్చల, చేసేది, ట్రాక్టర్ డ్రైవింగ్ అని సినిమాలో నరేష్ క్యారెక్టర్ గురించి చెప్పారు. ఇక అల్లరి నరేష్ బర్త్ డే కి పర్ఫెక్ట్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాతో అల్లరి నరేష్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు