Allari Naresh: సితారతో అల్లరి నరేష్ మూవీ…. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!

Allari Naresh: అల్లరి నరేష్… ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను సొంతం చేసుకున్న అల్లరి నరేష్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. కామెడీతోనే కాకుండా ఫ్యామిలీ, ఎంటర్టైనర్ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అల్లరి నరేష్ ఎప్పటికప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు.

Image
రాజేంద్ర ప్రసాద్‌ తర్వాతి స్థానం
తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ అండదండలతో…. అల్లరి నరేష్ తన కామెడీ టైమింగ్ తో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అల్లరి నరేష్‌ ఎక్కువ శాతం కామెడీ సినిమాలు చేసి..ఇండస్ట్రీలో టాప్‌ మోస్ట్‌ హీరో అయ్యారు. ఒకప్పుడు రాజేంద్రప్రసాద్ తరహాలో కామెడీ చిత్రాలలో అల్లరి నరేష్ దూసుకుపోయారు. ఇక తరుచూ కామెడీ సినిమాలు చేయడం వల్ల నరేష్‌ కాస్త డీలా పడ్డాడు. ఆ తర్వాత నరేష్ కు సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. దీంతో ఆల్లరి నరేష్ మహర్షి, నాంది లాంటి చిత్రాల్లో ఎమోషనల్ క్యారెక్టర్స్ లో నటించాడు. ఇక ఇప్పుడు నరేష్ మరో వైవిద్యమైన చిత్రంతో మనందరి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

- Advertisement -

 

మళ్లీ కామెడీ ట్రాక్ లోకి..!

మొన్నటి వరకు సైడ్‌ పాత్రలు చేసిన నరేష్‌… మళ్లీ హీరోగా సినిమాల్లో చేస్తున్నాడు. ఈ తరుణంలోనే మరో ప్రాజెక్టుకు అల్లరి నరేష్ కొబ్బరికాయ కొట్టేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇటీవలే జరిగిన అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా “మీరు అతని కంటి నుండి తప్పించుకోలేరు”అంటూ విలక్షణమైన కాన్సెప్ట్ పోస్టర్ తో నిర్మాణ సంస్థ ఈ చిత్ర ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టి పూజ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా రుహాని శర్మ మెరవనుంది. మెహర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ సినిమా కోసం అల్లరి నరేష్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అల్లరి నరేష్ ఎన్నో సినిమాల్లో నటిస్తున్నప్పటికీ తన అభిమానులు కోరుకునే కామెడీ మాత్రం రావడం లేదు. ఇక ఈ సినిమాతో మళ్ళీ అల్లరి నరేష్ తన ప్రేక్షకులను మెప్పిస్తారో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు