AN63 : అల్లరి నరేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ బ్యానర్ లో ఫిక్స్…

AN63 : టాలీవుడ్ టాలెంటెడ్ అల్లరి నరేష్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కొన్నాళ్లుగా ఫామ్ లో లేని నరేష్ నాంది సినిమాతో ట్రాక్ లోకి వచ్చాడు. అయితే ఆ తర్వాత చేసిన ఉగ్రం యావరేజ్ అవగా, రీసెంట్ గా మళ్ళీ కామెడీ జోనర్ లో ఆ ఒక్కటి అడక్కు సినిమా చేసి యావరేజ్ పలితాన్ని అందుకున్నాడు. అయితే అల్లరి నరేష్ ఆశించిన విజయం మాత్రం దక్కడం లేదు. అయినా నరేష్ మాత్రం ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ ఇయర్ ఇప్పటికే నా సామి రంగ సినిమాలో రెండో లీడ్ రోల్ లో నటించి మెప్పించగా, ఆ ఒక్కటి అడక్కు నిరాశపరిచినా తనలో కామెడీ యాంగిల్ ని మళ్ళీ చూపించి మెప్పించాడు. ఇక ఈ ఇయర్ “బచ్చలమల్లి” అనే యాక్షన్ సినిమాతో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఇక అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ నేడు ‘బచ్చలమల్లి’ నుండి ఒక స్పెషల్ గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ గ్లిమ్ప్స్ లో అల్లరి నరేష్ ఎప్పుడూ చూడని డిఫరెంట్ గెటప్ లో ఊర మాస్ గా కనిపించాడు. ఇక ఈ గ్లిమ్స్ కి కూడా ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Allari Naresh's 'AN63' movie under Sitara Entertainments banner

అల్లరి నరేష్ నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్…

అల్లరి నరేష్ ప్రస్తుతం బచ్చలమల్లి అనే సినిమాలో నటిస్తుండగా, తాం నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఈరోజు బర్త్ డే సందర్బంగా అనౌన్స్ చేయడం జరిగింది. టాలీవుడ్ లో టాప్ నిర్మాణ సంస్థలలో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ, స సౌజన్య నిర్మాణంలో అల్లరి నరేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. అల్లరి నరేష్ 63వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ AN63 గా ఉండగా, మెహర్ తేజ్ అనే డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇతను గతంలో సుహాస్ నటించిన ఫ్యామిలీ డ్రామా అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా లాక్ డౌన్ లో డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలైంది. ప్రస్తుతం సోనీ LIVలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక AN63 యొక్క అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సినిమా గురించి కొన్ని డీటెయిల్స్ ఉండగా, మూడు చేతుల్ని చూపించి చేతి వేళ్ళతో సినిమా కంటెంట్ గురించి హింట్ ఇస్తున్నట్టుగా ఉంది. దాని గురించి డీటెయిల్స్ పెద్దగా తెలియట్లేదు. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు రావాల్సింది.

- Advertisement -

బచ్చలమల్లి పూర్తవగానే.. AN63 స్టార్ట్…

ఇక అల్లరి నరేష్ ప్రస్తుతం బచ్చలమల్లి సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండగా, ఆ సినిమా షూటింగ్ తుదిదశకు చేసుకుంది. ఇక ఆ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక ఆ సినిమా రిలీజ్ కాగానే నాగవంశీతో సినిమా మొదలుకానుంది. అయితే AN63 వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ సినిమా గురించి ఇతర టెక్నిషియన్స్ గురించి వివరాలు రావాల్సి ఉంది. అయితే సినిమా ప్రారంభోత్సవం మాత్రం జులై లో జరిగే ఛాన్స్ ఉందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు