Ugram : నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగిన టాలీవుడ్ హీరో !

అల్లరి నరేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే ఎక్కువగా కామెడీ సినిమాలు చేసే అల్లరి నరేష్ ఈమధ్య రూటు మార్చారు. మొన్న ఆ మధ్య ‘నాంది’ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా విజయ్ కనకమెడల దర్శకత్వంలో నరేష్ ‘ఉగ్రం’ సినిమా చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర థియేటర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

అల్లరి నరేష్ కెరీర్ లో ఇది 60వ సినిమా. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడుతూ… ‘అడవిలో ఓ ఫైట్ సీన్ లో స్మోక్ మిషన్లు పెట్టారు. ఒకవైపు దట్టంగా పొగ వచ్చేలా మిషన్లు పెట్టారు. మరోవైపు నన్ను సిగరెట్ తాగుతూ రమ్మంటారు. దాదాపు నాలుగు రోజుల్లో ఐదారు వందలు సిగరెట్లు తాగాను.

దీంతో దగ్గు, జ్వరంతో నా ఆరోగ్యం దెబ్బతింది అని చెప్పుకొచ్చాడు. కాగా, వరుసగా కామెడీ సినిమాలు చేసిన నరేష్ కొంతకాలంగా తన పంతా మార్చుకున్నాడు. కామెడీకి చెక్ పెట్టి సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. అందుకు నాంది చిత్రాన్ని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విజయ్ కనకమెడల ఇప్పుడు మరోసారి ఉగ్రంతో సీరియస్ సినిమా చేశాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు