Allu Arjun: అల్లు అర్జున్ కంటూ ఫ్యాన్స్ లేరు .. ఉంది మెగా ఫ్యాన్సే ..

Allu Arjun: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో అంటే తెలుగులో అందరికీ వినిపించే పేరు మెగాస్టార్ చిరంజీవి. ముందుగా కొన్ని సినిమాల్లో విలన్ వేషాలు వేసి ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఖైదీ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి చిరంజీవిని స్టార్ హీరో చేసింది. తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సక్సెస్ఫుల్ సినిమాలను చేసారు మెగాస్టార్ చిరంజీవి.

ఇకపోతే గంగోత్రి(Gangotri) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్(All Arjun) డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు వేయించుకుంటూ తనకంటూ ఒక సొంత ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్న మాట వాస్తవమే. కానీ ఈ ప్రాసెస్ లో సక్సెస్ఫుల్ సినిమాలు చేసి అభిమానులు వచ్చిన తర్వాత, మెగా అభిమానులు అల్లు ఆర్మీ అంటూ ఫ్యాన్స్ ను సపరేట్ చేసేసాడు బన్నీ. రీసెంట్ గా మొన్న ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ కూడా నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అని మాట్లాడాడు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి మధ్య జరుగుతున్న వార్ పొలిటికల్ ట్రాక్ తీసుకుంది.

నువ్వు వెళ్లిన YCP MLA ని గెలిపించావా?

నేను పెద్ద పుడుంగిని ఇష్టమయితనే వస్తా… మానేయ్ వెల్లిపో ఎవరు అడిగారు నిన్ను.? మేం 21 కి 21 గెలిచాం.. నువ్వు వెళ్లిన YCP MLA ని గెలిపించావా? మీ నాన్న ఎంపీ గా నిలబడితే నువ్వు గెలిపించావా? అల్లు అర్జున్ కంటూ ఫ్యాన్స్ లేరు .. ఉంది మెగా ఫ్యాన్సే .. ఆయన ఊహించుకుటున్నాడేమో ఉన్నారని. అంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్(Bolishetty Srinivas) అల్లు అర్జున్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.

- Advertisement -

కాగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని చాలామంది హీరోలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వాటిలో చాలామంది హీరోలు ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సాధించుకున్నాడు. ఇక అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. మిగతా యంగ్ హీరోస్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేసుకుంటూ తమకంటూ సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.

Allu Arjun

అర్జున్ కు మెగా ఫ్యామిలీకి మధ్య విభేదాలు

ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి మధ్య చాలా విభేదాలు వస్తున్నాయి. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే మెగా అభిమానులు మాత్రం అల్లు అర్జున్ పై తీవ్రమైన కోపంతో ఉన్నారు. గతంలో అల్లు అర్జున్ చిరంజీవిని పొగిడిన వీడియోస్ ను బయటకు తీస్తూ ఇప్పుడు అల్లు అర్జున్ మాటలతో కంపేర్ చేస్తూ ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఇకపోతే చాలా చిన్నతనం నుండే అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఎలా ట్రీట్ చేశారు అనే వీడియోలు కూడా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు