Allu Arjun.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా హీరో గా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ సినిమాలలో.. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నైనా సరే అవకాశం రావాలి అని చాలామంది సెలబ్రిటీలు ఆరాటపడుతూ ఉంటారు.. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలను బ్యాన్ చేస్తున్నా.. ఇకపై ఆయన సినిమాలలో నటించను అంటూ చెబుతున్నారు గబ్బర్ సింగ్ నటుడు సాయి.
బన్నీ సినిమాలను బ్యాన్ చేస్తున్నా.. గబ్బర్ సింగ్ నటుడు..
అసలు విషయంలోకెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2012లో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్.. ఈ సినిమాతో ఆయన కెరియర్ యూ టర్న్ తీసుకుందనే చెప్పాలి. అందులో అంతాక్షరి ఎపిసోడ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సీన్ కోసం రిపీటెడ్ గా సినిమా చూసిన వాళ్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో జరిగిన ఆ అంతాక్షరి పవన్ కి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే అందులో పాల్గొన్న వారికి కూడా మంచి గుర్తింపు లభించింది.. అలాంటివారిలో సాయి కూడా ఒకరు.. ప్రస్తుతం ఈయన తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. మరి సాయి ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
వైసీపీకి మద్దతు పలకడం వల్లే బన్నీ సినిమాలలో నటించను..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గబ్బర్ సింగ్ సాయి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ మొదటి సినిమా నుంచి ఆయనను మెగా ఫ్యామిలీలో ఒక మెంబర్ గా అనుకున్నాను. మెగా హీరోగా ఓన్ చేసుకొని ఆయన ప్రతి సినిమాని కూడా నేను చూసాను.. అలాగే నాలాగే ఎంతోమంది కూడా అనుకుని ఉంటారు.. అలా అనుకోవడం వల్లే అల్లు అర్జున్ నెంబర్ వన్ హీరోగా ఈ స్థాయికి ఎదిగారు.. కానీ మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో.. అల్లు అర్జున్ వైసీపీ పార్టీ తరపున పోటీ చేసిన వ్యక్తికి మద్దతుగా నిలవడం నాకు నచ్చలేదు.. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.. ఇకపై అల్లు అర్జున్ సినిమాలలో నేను నటించను.. బన్నీ చేసిన ఆ తప్పిదం వల్లే ఇప్పుడు నేను ఆయన సినిమాలలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నాను అంటూ హాట్ బాంబు పేల్చారు సాయి.
అందుకే పుష్ప 2 సినిమాను రిజెక్ట్ చేశా..
అంతేకాదు అల్లు అర్జున్ ఫ్యామిలీ , మెగా ఫ్యామిలీల మధ్య ఎటువంటి విభేదాలు ఉండకూడదు.. ఆ రెండు కుటుంబాలు కలిసి ఉంటేనే ఇండస్ట్రీ మరింత బాగుపడుతుంది. ఆ రెండు కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపాడు . అదేవిధంగా నాగబాబు గతంలో చెప్పిన ఒక మాటని కూడా ఆయన గుర్తు చేశారు.. “మనోడు అయినా పరాయి వాళ్లకి పనిచేసేవాడు మనోడు కాదు.. పరాయి వాడైనా మనకు పనిచేసేవాడు మనోడు” అనే విషయాన్ని గుర్తు చేశాడు సాయి.. అందుకే పుష్ప 2 సినిమాలో అవకాశం వచ్చినా సరే నటించలేదు అని తెలిపాడు. సాయి పవన్ కళ్యాణ్ వీరాభిమాని.. పవన్ కళ్యాణ్ కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమవుతాడు.. అందుకే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో పవన్ తరపున ప్రచారం కూడా చేసి పవన్ మెప్పు పొందాలని ప్రయత్నం చేసిన సాయి ఇప్పుడు బన్నీపై ఇలాంటి కామెంట్లు చేశారు.