Allu Arjun: భార్యకు భారీ సర్ప్రైజ్..ధర తెలిస్తే షాక్..!

Allu Arjun.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో.. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు తన కుటుంబానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ముఖ్యంగా తన భార్య స్నేహారెడ్డి తో అలాగే తన పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ వెకేషన్స్ కి వెళ్తూ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. ఇదిలా ఉండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి తన భార్య అల్లు స్నేహారెడ్డి అంటే ఎంత ప్రేమ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దానిని అనేక సందర్భాలలో ఆయన నిరూపించారు కూడా..ఇక ఇప్పుడు ఆ ప్రేమని ఖరీదైన గిఫ్ట్ తో చూపించారు.

Allu Arjun: Big surprise for wife..Shock when she knows the price..!
Allu Arjun: Big surprise for wife..Shock when she knows the price..!

ఎప్పటికప్పుడు భార్యపై ప్రేమను చూపిస్తున్న బన్నీ..

ముఖ్యంగా తనకు తన భార్యపై ఎంత ప్రేమ ఉందో ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు.. సోషల్ మీడియాలో ఆ విషయాలను ఎక్కువగా పంచుకుంటారు అల్లు అర్జున్.. అప్పట్లో ఇద్దరుమ్మాయిలతో సినిమా సమయంలోనే భార్యపై తనకున్న ప్రేమను బయటపెట్టిన ఈయన.. అందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటే.. వాళ్ళు తనకు రెండు కళ్ళ లాంటివారు అని చెప్పారట.. మరి మీ భార్య ఏమిటి అని దర్శకుడు అడిగితే.. ఆమె నా హార్ట్ సర్.. హార్ట్ లేకపోతే జీవితమే లేదు కదా.. స్నేహ రెడ్డి లేకపోతే తన లైఫే లేదు అని చెప్పి తన భార్య మనసు దోచుకున్నారు అల్లు అర్జున్.

భార్యకు భారీ బహుమతి..

ఇదిలా ఉండగా తాజాగా ఆర్య సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్ర బృందం అంతా ఒకచోట చేరి ఘనంగా ఈవెంట్ నిర్వహించారు.. ఈ ఈవెంట్లో మరొకసారి తన ప్రేమ, పెళ్లి ప్రస్తావనకు తీసుకొచ్చారు అల్లు అర్జున్.. ఆమెతో తనది వన్ సైడ్ లవ్వే అని తెలిపారు. ఇక్కడ నుంచి ప్రేమ వెళ్లడమే కానీ అక్కడి నుంచే లేదని చెప్పారు.. అంటే తన భార్య అల్లు స్నేహ రెడ్డి అంటే తనకు ఎంత ఇష్టమో మరోసారి తెలియజేశారు.. అంతేకాదు ఇప్పుడు ఆ ప్రేమను మరింత కాస్ట్లీ గా వెల్లడించారు.. తన భార్యకి ఖరీదైన గిఫ్ట్ ను ఇచ్చారు.

- Advertisement -

గిఫ్ట్ ఏమిటి? దాని ధర ఎంత..?

ఏకంగా రూ.2.5కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం.. మరి ఏమిటా ఖరీదైన గిఫ్ట్ అని అంటే తన భార్యకి బన్నీ లేటెస్ట్ మోడల్ కాస్ట్లీ బిఎండబ్ల్యూ కారుని బహుమతిగా ఇచ్చారట.. బన్నీ ఈ కారణం ఇటీవల బుక్ చేయగా తాజాగా ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది.. మొత్తానికి అయితే భార్యపై ఉన్న ప్రేమను ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేశారు.. మొత్తానికైతే అల్లు అర్జున్ కారుని బుక్ చేస్తున్న ఫోటోతో పాటు కారు ఇంటికి వచ్చిన వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా దానిని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అభిమానులు.. అయితే ఇది తన భార్య కోసమే అని తెలుస్తోంది.. తన భార్యకు బహుమతి ఇచ్చి మరొకసారి తన ప్రేమను నిరూపించుకున్నాడు అంటే అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తన భార్యపై ఎంత ప్రేమ ఉందో మరొకసారి నిరూపించారు బన్నీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు