Guess The Actress : ఈ ఫొటోలో కనిపిస్తున్న పిల్లాడు ఓ స్టార్ హీరోకు మేనల్లుడు.. ఎవరో గుర్తు పట్టారా?

Guess The Actress : ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల చిన్నప్పటి ఫోటోలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.. ఇక చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన వారి చిన్ననాటి ఫోటోలు, సినిమాలు కూడా ఎక్కువగా నెట్టింట దర్శనం ఇస్తున్నాయి.. పైన ఫొటోలో కనిపిస్తున్న బుడ్డోడు ఇప్పుడు స్టార్ హీరో.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు.. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారు కదు.. ఆయన మరెవ్వరో కాదు ఐ కాన్ స్టార్ హీరో అల్లు అర్జున్.. పైన కనిపిస్తున్న ఫొటో విజేత సినిమాలోనిది.. ఆ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు..

ఈ సినిమా 1985 లో వచ్చింది.. మెగాస్టార్ చిరంజీవి, భాను ప్రియ, శారదా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అప్పటిలో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అల్లు అర్జున్ నటించాడు. అతి చిన్న వయస్సులోనే తన నటనతో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నాడు. ఆ సినిమాలో శరత్ బాబు కొడుకు పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నాడు.. ఆ తర్వాత మరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. కమల్ హాసన్ నటించిన స్వాతి ముత్యం సినిమాలో నటించి మెప్పించాడు..

allu arjun child wood photos viral in social media
allu arjun child wood photos viral in social media

ఆ సినిమాల తర్వాత చిరంజీవి డాడీ సినిమాలో నటించాడు.. ఆ సినిమా కూడా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. మొదటి సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. ఆ తర్వాత ఆర్య సినిమా తో కమ్ బ్యాక్ ఇచ్చాడు.. ఇక వరుసగా సినిమాలు చేశాడు. అందులో కొన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకున్నాయి.. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాడు.. ఆ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు