Pushpa2 : పుష్ప 2 వాయిదా పై హర్ట్ అయిన ఫ్యాన్.. మరీ ఇంత పిచ్చేంట్రా బాబు..

Pushpa2 : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప 2 సినిమాతో నేషనల్ వైడ్ పెరిగింది.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా మరో పుష్ప2 సినిమా రాబోతుంది.. ఈ సినిమా సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాను ఆగస్టు 15 న ముందుగా విడుదల చేస్తామని ప్రకటించారు.. ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.. దీనిపై చాలామంది బన్నీ ఫ్యాన్స్ సుకుమార్ పై ఫైర్ అవుతున్నారు.. తాజాగా ఓ ఫ్యాన్ ఏకంగా కోర్టులో కేసు పెడతానని ట్వీట్ చేశాడు.. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది..

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. మొదటి పార్ట్ గా వచ్చిన పుష్ప భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పార్ట్ తెరకేక్కుతుంది.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. రీసెంట్ గా మ్యాజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ రిలీజ్ చేసిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.. పుష్ప టైటిల్ సాంగ్ మాత్రం ఓ రేంజులో చక్కర్లు కొడుతుంది..

ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి.. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊరమాస్ లుక్ లో కనిపించబోతున్నాడు.. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను ముందుగా ఆగస్టు 15 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. మరో రెండు నెలల్లో రిలీజ్‌ కావాల్సినా పుష్ప-2 ఊహించని విధంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా మేకర్స్‌ ప్రకటించారు.. అయితే డీసెంబర్ 6 కు వాయిదా అయినట్లు ప్రకటించారు..ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.. దానికి ఓ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది..పుష్ప-2 సినిమాను వెంటనే విడుదల చేయాలని కమ్యూనిటీ తరపున కోర్టులో కేసు వేస్తా అంటూ ఐకాన్ స్టార్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చాడు.. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు