Allu Arjun: వాటే కన్నింగ్ థాట్ బన్నీ నీ తర్వాత ఎవరైనా

Allu Arjun: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్లపాటు దాదాపు హిట్ సినిమా లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెరుగుతూ ఉన్నారు తప్ప ఎక్కడ తగ్గలేదు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కూడా దీనికి ఒక కారణం అని చెప్పొచ్చు. ఒకవైపు సినిమాల్లో బిజీ అవుతూ కూడా మరోవైపు రాజకీయాల్లో కూడా అడుగులు వేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2014లో జనసేన అనే పార్టీని స్థాపించి 2019లో పోటీ చేయటం మొదలుపెట్టారు. అయితే 2019లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల కూడా ఓడిపోయారు. అక్కడితో పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం చాలా మంది మొదలుపెట్టారు.

ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంతటి కీలక పాత్రను పోషించారో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు తెలుగులో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సాధించుకున్న అల్లు అర్జున్ వైయస్సార్సీపి పార్టీ నాయకుడికి విషెస్ చెప్పడానికి నంద్యాలకు వెళ్లారు. అయితే అక్కడితో చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక రీసెంట్గా సాయి తేజ్ కూడా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని ఫాలో అవ్వడం మానేశాడు.
దాదాపు చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యాంటీగా మారిపోయారు.

Kalki 2898 AD

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా కల్కి. ఇక ఆ సినిమాపై చాలామంది సెలెబ్రెటీస్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ కూడా కల్కి సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. అయితే ఇది అల్లు అర్జున్ జెన్యూన్ గా చెప్పినా కూడా కొంతమంది అల్లు అర్జున్ కన్నింగ్ ఫెలో ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ని దగ్గర చేసుకోవడానికి మాత్రమే పెట్టిన ట్వీట్ అంటూ కొంతమంది అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి ఫ్యాన్ డేస్ ఉన్న హీరో ప్రభాస్ కాబట్టి ప్రభాస్ సినిమాను ఇప్పుడు సపోర్ట్ చేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ తమ పుష్ప సినిమా వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తారు అని ముందు జాగ్రత్తగా అల్లు అర్జున్ ఈ ట్వీట్ వేశాడని సోషల్ మీడియాలో కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు