Allu Arjun : అప్పుడు “నువ్వు లేకపోతే… నేను లేను”… ఇప్పుడు ” ఇలా అయితే నేను ఉండను”

Allu Arjun : గంగోత్రి సినిమాకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. రాఘవేందర్రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ను అందుకుంది కానీ అల్లు అర్జున్కి ఏమాత్రం పేరు రాలేదు. క్రెడిట్ అంతా రాఘవేంద్రరావు అకౌంట్లో పడిపోయింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకుడుగా పరిచయమైన ఆర్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన గ్రేట్ లవ్ స్టోరీ సినిమాల్లో ఈ సినిమా ఎప్పటికీ ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఈ సినిమాను డిజైన్ చేశాడు సుకుమార్. ఇక సుకుమార్కి బన్నీకి ఉన్న రిలేషన్షిప్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

ఆర్య సినిమా తర్వాత బన్నీ రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆర్య సినిమాతోనే బన్నీకి ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. బన్నీ తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆర్య సినిమాకు ఉన్న స్థాయి వేరు స్థానం వేరు. ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ ని అద్భుతంగా డిజైన్ చేసి అల్లు అర్జున్ కెరియర్ కి ఒక మైల్ స్టోన్ ఫిలిం చేసేసాడు. రీసెంట్ గా ఈ సినిమా 20 ఇయర్స్ ని కూడా పూర్తి చేసుకుంది. అయితే వీరిద్దరూ పుష్ప అనే సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సాధించారు. పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలామంది పుష్ప సినిమా డైలాగ్స్ ను మేనరిజమ్స్ ను విపరీతంగా వాడారు.

Pushpa 2

- Advertisement -

నువ్వు లేకపోతే నేనులేను

పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు మొదట తెలుగులో నెగిటివ్ టాక్ వచ్చింది. మామూలుగా సుకుమార్ సినిమాలకి ఇటువంటి టాక్ రావడం సహజం ఆ తర్వాత సినిమా మెల్లగా పుంజుకుంటుంది. అయితే నార్త్ లో వచ్చిన కలెక్షన్స్ చూసి అందరికీ దిమ్మతిరిగిపోయింది. ఇక పుష్ప సినిమా హిట్ అని ఒక క్లారిటీ అందరికీ వచ్చేసింది. ఈ సినిమా సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ గురించి ఎన్నో అమూల్యమైన మాటలు అని చెప్పారు. అలానే అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నేను పరుగు సినిమా చేస్తున్న టైంలో నాకు ఇష్టమైన కారు కొనుక్కున్నాను. నేను ఇక్కడ వరకు రావడానికి కారణం ఎవరు అని చూసినప్పుడు, నా వెనక్కి కేవలం కనిపించింది సుకుమార్ మాత్రమే. డార్లింగ్ “నువ్వు లేకపోతే నేనులేను” అంటూ సుకుమార్ ను ఎమోషనల్ చేసేసాడు.

ఇలా అయితే నేను ఉండను

కానీ ఇప్పుడు పరిస్థితి తేడాగా ఉంది. పుష్ప 2 సినిమా విషయంలో వీరిద్దరికీ భిన్న అభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తుంది. సుకుమార్ టార్చర్ తట్టుకోలేక బన్నీ అమెరికా చెక్కేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలానే ఈ సినిమా కంటిన్యూటివ్ కి సంబంధించిన గడ్డం కూడా రిమూవ్ చేసేసాడు బన్నీ. ఈ సినిమాలో మేనరిజమ్స్ కి బన్నీ గడ్డం ఎంత బాగా ఉపయోగపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కృత్రిమంగా దానిని పెట్టలేరు. అందుకోసమే అది పెరిగినంత వరకు వేచి చూడక తప్పదు. అప్పుడు “నువ్వు లేకపోతే… నేను లేను”… అని చెప్పిన బన్నీ ఇప్పుడు ” ఇలా అయితే నేను ఉండను” అనంత రేంజ్ కి విసిగి చెందాడు అని కొంతమంది అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు