Allu Arjun vs Keerthy Suresh : పుష్ప 2తో యుద్ధానికి సిద్ధమైన కీర్తి… ఏంటి పాప నీ ధైర్యం?

Allu Arjun vs Keerthy Suresh : కీర్తి సురేష్ ఏకంగా పుష్పరాజ్ తో బాక్స్ ఆఫీసు యుద్ధానికి సిద్ధమైంది. ఆమె నటిస్తున్న కొత్త సినిమా పుష్ప 2తో పోటీ పడబోతోంది. మరి ఏ మూవీని పుష్పరాజ్ కు పోటీగా బాక్స్ ఆఫీసు బరిలోకి కీర్తి దింపుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

కీర్తి కొత్త మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న రఘు తాత సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో ఎంఎస్ భాస్కర్, దేవదర్శిని, రవీంద్ర విజయ్, ఆనందసామి, రాజేష్ బాలకృష్ణన్ తదితరులు నటించారు. కేజీఎఫ్, కాంతర వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ నేరుగా తమిళంలో నిర్మించిన మొదటి చిత్రం రఘు దత్తా. అత్యంత ప్రజాదరణ పొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌కు కథను అందించిన సుమన్ కుమార్ ఈ చిత్రానికి కథను అందించారు. ఇప్పుడు రఘు తాత చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆగస్టు 15న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Raghu Thatha will release along with Pushpa 2.

- Advertisement -

కీర్తి వర్సెస్ అల్లు అర్జున్

అదే రోజున అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 విడుదల కాబోతుండడం విశేషం. దీంతో ఆ చిత్రానికి పోటీగా రఘు తాత విడుదలకు సిద్ధమయ్యాడు. అయితే ఇదొక చిన్న సినిమా. అలాంటి ఏకంగా బాహుబలి లాంటి అల్లు అర్జున్ సినిమాతో మేకర్స్ రెడీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

పుష్ప 2 మూవీపై హైప్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఈ మూవీ ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ కాబోతోంది. అంటే తమిళంలో కూడా రిలీజ్ కావడం పక్కా. మరి అలాంటిది ఇంత పెద్ద మూవీతో పోటీ అనగానే ఏంటి పాప నీ ధైర్యం? అని అడుగుతున్నారు నెటిజన్లు. నిజానికి ఈ మూవీకి ఏమాత్రం మిక్స్డ్ టాక్ వచ్చినా, పుష్ప సునామీ ముందు కొట్టుకుపోవడం ఖాయం. మరి ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో వేచి చూద్దాం.

మేకర్స్ ధైర్యం అదేనా ?

తాజా పరిణామాలు చూస్తుంటే ఈ సినిమాలోని కంటెంట్ పై మేకర్స్ గట్టిగానే నమ్మకం పెట్టుకున్నట్టుగా కన్పిస్తోంది. అంతేకాకుండా అక్కడున్నది మహానటి. కానీ పుష్ప రాజ్ తో పోటీ పడడానికి బడా బడా సినిమాలు, కొన్ని పెద్ద హిందీ సినిమాలే భయపడ్డాయి. ఈ మూవీ కోసం తమ మూవీని మేకర్స్ వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. పుష్ప 2 కు హిట్ టాక్ వచ్చిందంటే మేకర్స్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి బాధ పడక తప్పదు. ఖాళీగా ఉన్న డేట్స్ అన్నీ వదిలేసి పోయి పోయి పుష్ప రాజ్ తో పెట్టుకుంటున్నారు.

గతంలో ఇలాగే..

ఓన్లీ పుష్ప విషయంలోనే కాదు గతంలో సలార్ విషయంలో కూడా ఇదే జరిగింది. సలార్ కు పోటీగా ప్రతి భాషలోనూ అదే టైమ్ కు ఒక్కో మూవీ రిలీజ్ అయింది. ఒక్క తెలుగులో తప్ప. ఇప్పుడు పుష్ప వంతు వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు