Allu Arjun VS Mega Family : బన్నీ బలుపు తగ్గేదే లేదా…? మధ్యలో పాపం అరవింద్ బలి

Allu Arjun VS Mega Family : అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలి… ఇది ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు. అప్పుడెప్పుడో “చెప్పను బ్రదర్” అంటూ చెప్పకనే చెప్పాడు.. మెగా ఫ్యామిలీకి అందులోనూ పవన్ కళ్యాణ్‌కి తనకు ఉన్న దూరాన్ని. ఇక ఎన్నికల టైంలో అది కాస్త ఎక్కువ అయింది. ప్రమాణ స్వీకారం టైంలో మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సోషల్ మీడియాలో బన్నీని అన్ ఫాలో చేయడంతో అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ గురించి మళ్లీ చర్చకు వచ్చింది.

మెగా ఫ్యాన్స్ ట్రోల్స్…

పుష్ప సినిమాలో బన్నీ డైలాగ్… తగ్గేదే లే.
పుష్ప 2 మూవీలో బన్నీ డైలాగ్… అసలు తగ్గేదే లే.
ఇప్పుడు ఈ రెండు డైలాగ్స్‌తో మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీతో బన్నీ దూరంగా ఉండటం పుష్ప సినిమా నుంచే స్టార్ట్ అయిందని, అప్పుడు బన్నీ బలుపు తగ్గేదే లే అనేలా ఉందని, పుష్ప 2కి వచ్చే టైంకి బన్నీ బలుపు అసలు తగ్గేదే లే అన్నట్టు తయారు అయింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. దీని వల్ల అల్లు అర్జున్ కే ప్రాబ్లమ్స్ వస్తాయని అంటున్నారు.

మధ్యలో అరవింద్ బలి…

అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వివాదం నడుస్తున్నా… అందరికీ తెలిసిన విషయం ఏంటంటే… చిరంజీవి అయినా, మెగా ఫ్యామిలీ అయినా, అల్లు అరవింద్‌కు చాలా చాలా గౌరవం. అందుకే మెగా ఫ్యామిలీలో ఎలాంటి ఫంక్షన్ అయినా అరవింద్ తప్పకుండా వెళ్తారు. అయితే ప్రస్తుతం… అల్లు అరవింద్ రెండు బంధాల మధ్య బలి అయిపోతున్నారు అని చెప్పొచ్చు.

- Advertisement -

బావ (చిరంజీవి) అంటే అభిమానం ఉన్నా… కొడుకు (అల్లు అర్జున్) చేసే పనుల వల్ల అల్లు ఫ్యామిలీ మొత్తం విమర్శలను ఎదుర్కొంటుంది. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా అల్లు అర్జున్.. వైసీపీ కి సపొర్ట్ చేస్తే, వచ్చే విమర్శలను కంట్రోల్ చేయడానికి.. రామ్ చరణ్ తో కలిసి పిఠాపురంలో పవన్ కు మద్దత్తుగా ప్రచారం చేశాడు. కానీ, ఇలా ప్రతీ సారి విమర్శలను కంట్రోల్ చేయ్యడం సాధ్యం అవ్వడం లేదు. దీంతో మెగా ఫ్యామిలీ ముందు, ఫ్యాన్స్ ముందు అరవింద్ బలి అయిపోతున్నారు.

Pawan Kalyan, Chiranjeevi, Ram Charan And Allu Aravind, Allu Arjun
Pawan Kalyan, Chiranjeevi, Ram Charan And Allu Aravind, Allu Arjun

ఇప్పుడు పుష్ప తగ్గుతుందా…?

అల్లు అర్జున్ సినిమాలు వస్తున్నాయంటే, అల్లు ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా వెళ్లి చూస్తారు. పుష్ప విక్టరీ ని కేవలం అల్లు ఫ్యాన్స్ మాత్రమే కాదు, మెగా ఫ్యాన్స్ కూడా సెలబ్రెట్ చేసుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ వివాదం తర్వాత అల్లు అర్జున్ కు ఆయన సినిమాలకు మెగా ఫ్యాన్స్ నుంచి సపొర్ట్ రాకపోవచ్చు. ఇది రాబోయే పుష్ప 2పై ఎఫెక్ట్ కాస్త ఎక్కువే చూపించొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు