Allu Arjun Vs Mega Fans: సినిమా చూసాం, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ వెళ్లి బ్లడ్ ఇస్తాం అన్నయ్య అదే నేర్పాడు మాకు, ఆర్మీ స్కూల్ కి వెళ్ళింది

Allu Arjun Vs Mega Fans: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కు మధ్య మళ్లీ చిచ్చు రాజుకుంది. మారుతీ నగర్ సుబ్రమణ్యం అనే సినిమా ఈవెంట్ కు హాజరైన అల్లు అర్జున్ “నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తా” అని ఒక మాట మాట్లాడడంతో ఇన్ డైరెక్ట్ గా చాలామందికి సమాధానం చెప్పినట్లు అయింది. దీని వెనక కారణం ఏంటంటే గతంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ను ఎంతలా టార్గెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే చాలు చాలామంది ప్రభుత్వం ఉద్యోగులను థియేటర్ వద్ద కాపలా ఉంచేది. పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ రేట్లను తగ్గించేసేది. ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ తరపున చాలాసార్లు ప్రశ్నించారు. ఆ టైంలో ఇండస్ట్రీ నుంచి నాని వంటి యంగ్ హీరో కూడా మాట్లాడారు.

2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ విపరీతంగా కష్టపడి 2024లో పోటీకి సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీకి చాలామంది సెలబ్రిటీస్ తమ వంతు ట్వీట్లు చేశారు. కొంతమంది డైరెక్ట్ గా ప్రచారం కు వచ్చి పాల్గొని పవన్ కళ్యాణ్ వైపు నిలబడ్డారు. ఇ తరుణంలో అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ వేశాడు. అయితే పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుతున్నాడు అదే పార్టీకి సంబంధించిన ఒక వైసీపీ కాండేట్ కి సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళాడు. అక్కడితో మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి మధ్య విభేదాలు మరోసారి మొదలయ్యాయి. అల్లు అర్జున్ గురించి ఇన్ డైరెక్ట్ గా నాగబాబు ట్విట్టర్ వేదిక ట్వీట్ కూడా వేసి డిలీట్ చేయడం జరిగింది.

Allu Arjun

- Advertisement -

ఇకపోతే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం గురించి ఇప్పుడు పెద్దగా స్పందించలేదు. ఇక ఈవెంట్ లో అలా మాట్లాడటం వలన మరోసారి గొడవలకు దారి తీసినట్లు అయింది. అలానే నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అని మాట్లాడాడు అల్లు అర్జున్. ఇంతకుముందు మెగా ఫ్యామిలీ అంతటినీ కలిపి మెగా ఫ్యాన్స్ అని అల్లు అర్జున్ ఇప్పుడు నా ఫ్యాన్స్ అనడం చాలామందికి నచ్చలేదు. అయితే కొంతమంది అల్లు అర్జున్ ను డైరెక్ట్ గా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఇక మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమా చూసి వచ్చిన కొంతమంది ఇప్పుడే సినిమా చూసాం, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి బ్లడ్ ఇస్తాం. అన్నయ్య మాకు ఇదే నేర్పించాడు అంటూ మాట్లాడుతున్నారు.

ఆర్మీ స్కూల్ కి వెళ్ళింది

ఇ తరుణంలో అల్లు అర్జున్ ఆర్మీ గురించి అడిగితే ఆర్మీ స్కూల్ కి వెళ్ళింది అంటూ సెటైర్లు వేయటం మొదలుపెట్టారు. అంటే దీని వెనక ఉన్న ఉద్దేశ్యం అల్లు అర్జున్ కు ఉన్నదంతా నిబ్బా నిబ్బి ఫ్యాన్స్ అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్తో మళ్ళీ సోషల్ మీడియా అంతా మెగా వెర్సెస్ అల్లు అర్జున్ అంటూ టాపిక్స్ మొదలయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు