Bunny – Sneha Anniversary: 13 యేళ్ళ వైవాహిక జీవితం.. బన్నీ – స్నేహ ముచ్చట్లివే..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ పాపులారిటీ సంపాదించుకున్న హీరోలలో ఒకరిగా నిలిచారు.. అల్లు అర్జున్ సినీ కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం పుష్ప.. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు.. అల్లు అర్జున్ సినిమాల పరంగా పక్కన పెడితే.. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడానికి సపరేట్ కేటాయిస్తూ ఉంటారు..

అల్లు అర్జున్ – స్నేహారెడ్డి…
సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో వెకేషన్స్ కు టూర్లకు వెళుతూ ఉంటారు.. ఈ రోజున అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ తన భార్యకు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ ని వెరైటీగా తెలియజేశారు. అలాగే తన భార్యతో కలిసి ఉన్న క్యూట్ ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది.. మన వివాహమై 13 ఏళ్లు అయిపోయింది.. నేను ఇలా ఉండడానికి కారణం నీతో బంధమే అన్నట్టుగా తెలియజేశారు.. నీ ప్రశాంతతతో నాకు బోలెడంత ప్రేమని, శక్తిని ఇచ్చావ్.. మనం ఇలా మరెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ వెడ్డింగ్ యూనివర్సిటీ క్యూటీ అంటూ తన భార్య పైన ప్రేమను చాటుకున్నారు అల్లు అర్జున్

ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు , నెటిజన్ లు సైతం అల్లు అర్జున్ – స్నేహ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి పెళ్లి 2011లో జరిగింది.. వీరి ప్రేమ బంధానికి ప్రతిరూపంగా అయాన్, అర్హ పుట్టారు.. అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.. సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు.. హీరోయిన్గా రష్మిక నటిస్తోంది. ఆగస్టు 15న పుష్ప-2 పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది.

- Advertisement -

స్నేహ రెడ్డి ఫ్యాన్ ఫాలోయింగ్…
గత కొన్ని నెలలుగా అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి పలు రకాల ఫోటోలను షేర్ చేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో కూడా స్నేహ రెడ్డికి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అనే రూమర్స్ అయితే వినిపించాయి.. అల్లు అర్హ కూడా సమంత నటించిన శాకుంతలం చిత్రంలో నటించింది.. మరోవైపు అల్లు అయాన్ కూడా పుష్ప -2 సినిమాలో నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే నిజమైతే అల్లు అయాన్ ఎంట్రీ కూడా ఓకే అయినట్టే అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. మొత్తానికైతే అల్లు ఫ్యామిలీ మొత్తం సినిమాలలోనే నటిస్తున్నారు అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు అభిమానులు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు