Pushpa: సుకుమార్ ఫ్రాంచైజ్ ప్లానింగ్.?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు అందులో సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ ఒకటి. ఆర్య సినిమాతో దర్శకుడుగా కెరియర్ మొదలుపెట్టాడు సుకుమార్. ఆ సినిమాలో వన్ సైడ్ లవ్ అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేసి యూత్ ని అట్రాక్ట్ చేశాడు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన కూడా, ఆర్య సినిమా అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టింది అని చెప్పొచ్చు.

అల్లు అర్జున్ కెరియర్ లో ఎంతమంది దర్శకులతో పనిచేసిన కూడా సుకుమార్ కి అల్లు అర్జున్ కి ఉన్న బాండ్ వేరు. అలానే అల్లు అర్జున్ ఎక్కువసార్లు పనిచేసిన దర్శకుల జాబితాలో సుకుమార్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటారు. అల్లు అర్జున్ ఇప్పటివరకు త్రివిక్రమ్ తో చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించి పెట్టింది. ఇక సుకుమార్ తో చేసిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది.

కేవలం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు మాత్రమే కాకుండా నేషనల్ అవార్డు ను కూడా తీసుకొచ్చి పెట్టింది పుష్ప. అయితే పుష్ప సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ ఎంత చెప్పినా తక్కువే. క్రికెటర్స్ , పొలిటికల్ లీడర్స్ ఈ సినిమాలోని డైలాగులు ఎంతగా వాడుకున్నారో సోషల్ మీడియాలో మనం ఇదివరకే చూశాం. ఇకపోతే పుష్ప – 2 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. అలానే తాజాగా పుష్ప-3 గురించి కూడా ఒక అప్డేట్ ను రీవీల్ చేశాడు అల్లు అర్జున్.

- Advertisement -

పుష్ప మూవీని బెర్లిన్ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తున్నారు. ఆ ఫిలిం ఫెస్టివల్ కి హాజరైన అల్లు అర్జున్ పుష్ప 3 గురించి మాట్లాడుతూ, ఆ మూవీ కన్ఫామ్ గా ఉండొచ్చని అన్నారు. దానికి సంబంధించి మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఇక పుష్ప ని ఫ్రాంచైజ్ లుగా మార్చాలని అంటుకుంటున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. దీనితో పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన సినిమా రష్మిక మందన్న నటించింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప-2 చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు