Allu Family on Ap : ఏపీలో కూటమి గెలుపును ఇలా వాడుకుంటున్న అల్లు వారి ఫ్యామిలీ…

Allu Family on Ap : నరాలు తెగే ఉత్కంఠతను రైకెత్తించిన ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ లో కూటమి అత్యధిక మెజారిటీతో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే కూటమి నాయకులు సంబరాలు జరుపుకుంతుండగా, సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా కూటమి గెలుపుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో కూటమి గెలుపును అల్లు వారి ఫ్యామిలీ వేరే విధంగా వాడుకుంటుంది. ఇంతకీ అల్లు ఫ్యామిలీ ఏం చేసింది? అనే విషయంలోకి వెళ్తే…

కూటమి గెలుపును వాడుకుంటున్న అల్లు ఫ్యామిలీ

ఏపీలో కూటమి ఇంకా కౌంటింగ్ కూడా పూర్తి కాకముందే అత్యధిక భారీ మెజారిటీతో విజయభేరి మోగించింది. దీంతో దాదాపుగా కూటమి గెలుపు ఖాయం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే అల్లు వారి ఫ్యామిలీ ఓ వీడియోను వైరల్ చేస్తూ కూటమి గెలుపును తమకు అనుకూలంగా మార్చుకుని వాడుకుంటోంది. అసలు విషయం ఏమిటంటే అల్లు అరవింద్ ఓటీటీ సంస్థ ఆహా యాప్ లో అన్ స్టాపబుల్ అనే షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ షోలో గతంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఎపిసోడ్ ను ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.

NBK-PSPK unstoppable from | cinejosh.com

- Advertisement -

అప్పట్లో అన్ స్టాపబుల్ షోలో బాలయ్య, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. దీనివల్ల ఆహా యాప్ కి కలిగే ఉపయోగం ఏమిటంటే భారీ సంఖ్యలో వ్యూస్ పెరగడమే కాకుండా, సబ్స్క్రైబర్స్ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో అల్లు వారి ఫ్యామిలీ కూటమి గెలుపును ఈ రకంగా ఉపయోగించుకుంటుంది అనే టాక్ నడుస్తోంది.

అల్లు వర్సెస్ మెగా సపోర్ట్… మెగా ఫ్యాన్స్ ఫైర్

అలాగే ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన పరిస్థితులను కూడా నెమరు వేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడేమో కూటమి గెలిచింది అంటూ ఇలా పవన్ కళ్యాణ్, బాలయ్య కలిసి ఉన్న అన్ స్టాపుల్ షోకు సంబంధించిన ఎపిసోడ్ ను వైరల్ చేసి తమ ఓటీటీ యాప్ డెవలప్మెంట్ కు వాడుకుంటున్నారు. కానీ ప్రచారం సమయంలో మాత్రం గంపగుత్తగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా తండ్రి కొడుకులు కలిసి గేమ్ ప్లే చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫాన్స్. రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయగా, అల్లు అర్జున్ మాత్రం ఏకంగా వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థికి చివరి నిమిషంలో సపోర్ట్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో అల్లు అరవింద్ మాత్రం రామ్ చరణ్ వెంట పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ కనిపించారు. దీంతో మరోసారి అల్లు మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. మరి అప్పుడు తన కొడుకు చేసిన పనికి ఇప్పటిదాకా సమాధానం చెప్పని అల్లు అరవింద్ ఏ ముఖం పెట్టుకొని ఏపీలో కూటమి గెలుపును తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు మెగా ఫాన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు