Allu Sireesh: చడి చప్పుడు లేకుండా వస్తున్న అల్లు శిరీష్ కొత్త సినిమా ట్రైలర్

Allu Sireesh: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు డజన్ మంది మెగా హీరోలు ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకొని సినిమాలు చేస్తున్నారు. చాలామంది మంచి హిట్ ఫిలిమ్స్ కూడా అందుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సాధించుకున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎక్కడికో ఎదిగిపోయాడు అని చెప్పొచ్చు. అయితే అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గౌరవం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. ఆ సినిమా ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. కానీ అల్లు శిరీష్ కు మాత్రం ఒక గౌరవని తీసుకొచ్చి పెట్టింది.

Allu Sirish

ఆ తర్వాత అల్లు శిరీష్ చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకున్నాయి. కానీ అల్లు శిరీష్ కెరియర్ లో ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ సినిమా అంటూ పడలేదు. ప్రతి హీరో కెరియర్ కి ఒక బ్లాక్ బస్టర్ సినిమా అంటూ ఉంటుంది. కానీ సిరీస్ కి ఇప్పటివరకు అలా లేదు. ఇక రీసెంట్గా శిరీష్ నటించిన సినిమా ఊర్వశివో రాక్షసివో ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు సిరీస్ సినిమా అప్డేట్ అంటూ రాలేదు.

- Advertisement -

ఇకపోతే శిరీష్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ సామ్ అంటోన్ దర్శకత్వంలో ఈ ‘బడ్డీ’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో టెడ్డీ బేర్ తో కలిసి యాక్షన్ సీన్స్ చేయబోతున్నాడు . గాయత్రీ భరద్వాజ్ ఇందులో హీరోయిన్ గా కనిపించనుంది. తమిళ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ గా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని సమాచారం. ఇకపోతే ఈ సినిమా నుంచి రీసెంట్ గానే ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సినిమా ట్రైలర్ను రేపు రిలీజ్ చేయబోతున్నట్లు కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు