Allu Sireesh: బన్నీని ఇన్సల్ట్ చేసిన శిరీష్. అతడిని చూసి నేర్చుకో అంటూ..?

Allu Sireesh.. అల్లు వారసుడు అల్లు శిరీష్ తాజాగా నటిస్తున్న చిత్రం బడ్డీ. ఈనెల 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ వేగంగా చేపట్టారు చిత్ర బృందం. టెడ్డీబేర్ కాన్సెప్ట్ తో యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అల్లు శిరీష్, తాజాగా తన అన్నయ్య గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు శిరీష్ కి మీరెందుకు వరుసగా సినిమాలు చేయడం లేదు.. అలాగే సపరేట్ గా పీ ఆర్ టీం పెట్టుకోవచ్చు కదా అంటూ యాంకర్ ప్రశ్నించింది.

Allu Sireesh: Sirish who insulted Bunny. Look at him and learn..?
Allu Sireesh: Sirish who insulted Bunny. Look at him and learn..?

ప్రభాస్ ను ఆకాశానికెత్తేసిన అల్లు శిరీష్..

దీనికి అల్లు శిరీష్ మాట్లాడుతూ.. వరుసగా సినిమాలు చేస్తూ ఉంటే ప్రేక్షకులే మనల్ని గుర్తు పెట్టుకుంటారు. ఇక మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సినిమాలే మన గురించి చెబుతాయి. ఈ విషయం ప్రభాస్ నుంచి నేర్చుకోవాలి. ఆయన అసలు ఎక్కడ కూడా కనిపించరు. కానీ ఆయన సినిమాలు మాత్రం కనీసం 10 నెలలకు ఒకటైన ప్రేక్షకులను అలరిస్తాయి . సింప్లిసిటీకి ఆయన పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన చేసేవన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలే అన్నీ కూడా బాగుంటాయి. కానీ ఆయన ఎక్కడా కనిపించరు. ఎలాంటి హడావిడి చేయరు. ఇలాంటివి ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవాలి. అంతేకాదు ఆయన సినిమాలను ఆయన ఎప్పుడూ ప్రమోట్ చేసుకోరు. ఆయనకు పిఆర్ టీం లేదు.. ఏ అవార్డు ఫంక్షన్ కి , రియాల్టీ షోలకి కూడా రారు.. కానీ ఆయన సినిమాల ఈవెంట్స్ కి మాత్రం వచ్చి చిన్నగా ప్రమోట్ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఆయన సినిమాలు మాత్రం సూపర్ హిట్ విజయాన్ని అందుకుంటాయి అంటూ అల్లు శిరీష్ తెలిపారు.

బన్నీని ఇన్సల్ట్ చేశాడుగా..

ఇకపోతే తన అన్నయ్య అల్లు అర్జున్ ను కాదని ప్రభాస్ ను పొగడడంపై బన్నీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే మరో యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో అల్లు అర్జున్ పి ఆర్ టీం గురించి ప్రస్తావించారు. బన్నీకి గత పదేళ్లుగా పీ ఆర్ ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాక ఆ టీం మరింత పెద్దదైంది. బన్నీ సినిమా ప్రమోషన్స్ మొదలుకొని ఆయనపై నెగిటివ్ ట్రోల్స్, విమర్శలు అన్నీ కూడా పీ ఆర్ టీం చూసుకుంటుంది అంటూ స్పష్టం చేశాడు. అయితే అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా స్టేట్మెంట్ ఇవ్వడంతో బన్నీకే సెటైర్ వేశాడని, తన అన్నయ్యని ఇన్సల్ట్ చేసినట్లు అయింది అంటూ బన్నీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

బన్నీ ఫ్యాన్స్ ఫైర్..

అంతేకాదు కల్కి సినిమా కోసం బుజ్జి అనే కారుతో ఒక ఈవెంట్ ఫుల్ కాస్ట్ తో ఒక ఇంటర్వ్యూ చేశాడు . ఇన్స్టా లో ప్రమోషన్స్ ప్రభాస్ చేశాడు.. ఇవన్నీ అల్లు శిరీస్ మరిచిపోయాడా? కళ్ళ ముందు ఇన్ని కనపడుతున్నా కూడా ప్రభాస్ కి పి ఆర్ టీం లేదని ఎలా చెబుతాడు.. అంటూ ఇవన్నీ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు