Allu Sirish : అదే ఆయన ధైర్యం.. మెగా గొడవపై అల్లు శిరీష్ షాకింగ్ కామెంట్స్..!

Allu Sireesh.. అల్లు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అల్లు అర్జున్ , అల్లు శిరీష్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక పేరు సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతుంటే. ఆయన సోదరుడు అల్లు శిరీష్ మాత్రం ఒక్క బ్లాక్ బస్టర్ హిట్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోని వరుస సినిమాలు చేస్తున్నారు కానీ అదృష్టం మాత్రం ఆయన తలుపు తట్టడం లేదు. ఈ క్రమంలోనే పలు సినిమాలలో నటిస్తూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈయన నటించిన చిత్రం బడ్డీ.. టెడ్డీబేర్ కాన్సెప్ట్ తో యాక్షన్ ఓరియంటెడ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంది. ఇక జూలై 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ను శరవేగం చేసిన విషయం తెలిసిందే.

Allu Sireesh: That's his courage.. Allu Sireesh's shocking comments on the mega fight..!
Allu Sireesh: That’s his courage.. Allu Sireesh’s shocking comments on the mega fight..!

అదే అన్నయ్య ధైర్యం – అల్లు శిరీష్..

అందులో భాగంగానే పలు మీడియా ఛానల్స్ , యూట్యూబ్ ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యులలో అల్లు శిరీష్ మాట్లాడుతూ.. సినిమా విశేషాలతో పాటు మెగా – అల్లు వివాదం అలాగే తన అన్నయ్య అల్లు అర్జున్ సక్సెస్ వెనక కారణాలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా.. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయిపోయారు కదా.. ఆయనకు సపోర్టుగా ఎవరైనా ఉన్నారా అని అడగ్గా.. బన్నీకి దాదాపు 10 ఏళ్లుగా ఒక టీం పని చేస్తోంది. ఒక ప్రొఫెషనల్ టీం అది. బన్నీ కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఆ టీం చూసుకుంటుంది ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ టీం ఇంకా పెద్దది అయిపోయింది. బన్నీ కి సంబంధించిన పాజిటివ్, నెగిటివ్ ఏ అంశాల పైన అయినా సరే ఈ టీం వేగంగా స్పందిస్తుంది అంటూ.. తన అన్న సక్సెస్ వెనక ఉన్న పీఆర్ టీం గురించి చెప్పుకొచ్చారు అల్లు శిరీష్. అలాగే మెగా ఫ్యామిలీ గొడవలపై పిఆర్ టీం గురించి చెప్పి క్లారిటీ ఇచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు.

మెగా గొడవలపై పరోక్షంగా స్పందన..

ఇకపోతే సాధారణంగా ఏ హీరో కైనా సరే పీఆర్ టీం అనేది ఉండడం సహజం. కానీ అల్లు అర్జున్ విషయంలో ఇది చాలా భిన్నంగా ఉంటుంది.. ఎందుకంటే ఆయన గురించి సినిమా అప్డేట్స్, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను మొదలుకొని వేసే కౌంటర్ల వరకు ఈ టీమ్ చాలా వేగంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మెగా అభిమానులు బన్నీపై విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారందరికీ సరైన సమాధానాన్ని ఈ టీమ్ చెబుతోందని, ఇక అదే బన్నీ ధైర్యం అని అల్లు శిరీష్ ప్రత్యక్షంగా అటు పరోక్షంగా కూడా కామెంట్లు చేశారు. ఏది ఏమైనా అల్లు శిరీష్ ఇచ్చిన ఈ సమాధానంతో బన్నీ పిఆర్ టీం ఒక సైన్యంలా పనిచేస్తుందని, ఆయనకు అడ్డు గోడగా నిలుస్తున్నారని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే మెగా – అల్లు ఫ్యామిలి వివాదం గట్టిగా నడుస్తున్న నేపథ్యంలో మరోవైపు పుష్ప 2 రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయనను మరింత నెగిటివ్గా చూపించే అవకాశం ఉంది.. అందుకే ఈ విషయంలో బన్నీ ఫాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు… కానీ ఎట్టకేలకు శిరీష్ చెప్పిన సమాధానంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక మెగా అభిమానులు ఎలాంటి ట్రోల్స్ చేసిన వారికి గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేయడానికి బన్నీ పిఆర్ టీమ్ సిద్ధంగా ఉంది అని పరోక్షంగా కామెంట్లు చేశారు అల్లు శిరీష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు