Allu Sirish: మెగా హీరోలు కాకుండా అల్లు శిరీష్ కి నచ్చే స్టార్ పెరఫార్మర్ ఎవరంటే.?

Allu Sirish: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మెగా హీరోస్ లో అల్లు శిరీష్ ఒకరు. గౌరవం సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నాయి. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు వంటి సినిమాలు శిరీష్ కి మంచి పేరును తీసుకొచ్చాయి. చాలామంది మెగా హీరోస్ తో శిరీష్ కి మంచి బాండింగ్ ఉంటుంది. చాలామంది మెగా హీరోలు ఒక సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది అని అంటే భారీగా సినిమా ఆడియో లాంచ్ ను చేయటం. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం వంటివి చేస్తూ ఉంటారు.

ఇక అల్లు శిరీష్ విషయానికి వస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పెద్దగా ఎవరిని ఆహ్వానించడు. తన సొంత అన్నయ్య అల్లు అర్జున్ ను కూడా చాలా తక్కువ సందర్భాల్లో ఇన్వైట్ చేశాడు. అలానే తను చేస్తున్న సినిమాలు గురించి కూడా ట్రైలర్ గానీ టీజర్ గాని షేర్ చేయమని అడగడు. ఇలాంటి చాలా క్వాలిటీస్ అల్లు శిరీష్ కి మంచి పేరును తీసుకొచ్చి కొంతమంది లో మంచి అభిప్రాయాన్ని కూడా క్రియేట్ చేశాయి. లేకపోతే శిరీష్ చివరగా చేసినా ఊర్వశివో రాక్షశివో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది.

Allu Sirish About Mahesh Babu

- Advertisement -

అయితే ప్రతి హీరో కూడా తమకంటూ ఒక సొంత అభిమాన హీరో ఉంటారు. చాలామందికి ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం అనే విషయం తెలిసిందే. ఇక అల్లు శిరీష్ విషయానికి వస్తే మెగా హీరోలు కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు చాలా ఇష్టం అంటూ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక శిరీష్ ప్రస్తుతం బడ్డీ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇదే కథను మొదట సందీప్ కిషన్ కి చెప్పి కొన్ని కారణాల వలన అది పట్టాలెక్కకపోతే శిరీష్ చేశాడు అనే వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కానీ దీని గురించి ఎక్కడ అధికారికంగా మాట్లాడలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు