Buddy : అన్యాయాన్ని ఎదిరించడానికి తిరగబడ్డ టెడ్డి.. ట్రైలర్ అదిరిపోయింది..

Buddy :  టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ చాలా కాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఆ సినిమాకు సైలెంట్ గా షూటింగ్ ను మొదలుపెట్టారు.. ఆ సినిమానే ‘బడ్డీ ‘.. ఈ సినిమా తమిళ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం టెడ్డీకి రీమేక్ గా రాబోతుంది. శాన్ అంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి వార్తల్లో హైలెట్ గా నిలిచింది. ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ రిలీజ్ పై ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. తాజాగా హీరో అల్లు శిరీష్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు..

ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. ఆ ట్రైలర్ లో మొదట సాయికుమార్ పవర్ ఫుల్ డైలాగ్ తో వీడియో మొదకవుతుంది.. అన్యాయాన్ని ఎదిరించే టెడ్డిని ఎప్పుడైన చూశారా అంటూ టెడ్డిని చూపిస్తారు.. ట్రైలర్ లోని ప్రతి యాక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.. హీరో శిరీష్ ఫైట్ చేస్తూ కనిపిస్తాడు.. అయితే ఈ సినిమా శిరీష్ ఫైలేట్ పాత్రలో కనిపిస్తున్నాడని తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే వీడియో ఆసక్తికరంగా ఉంది.. ప్రస్తుతం ఈ ట్రైలర్ భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది..

- Advertisement -

ఇకపోతే స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన బడ్డీ చిత్రంలో గాయత్రీ భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, మహమ్మద్ అలీ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. హిప్‌హాప్ తమిజా ఈ చిత్రం కి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.. ఈ సినిమాతో శిరీష్ హిట్ టాక్ ను అందుకుంటాడో లేదో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు