Allu Sirish: ఫిలింనగర్ లో గుసగుసలు పై క్లారిటీ, సుకుమార్ పుష్ప సినిమాని అద్భుతంగా చెబుతున్నారు

Allu Sirish: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో పుష్ప 2 ఒకటి. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. దర్శకుడు సుకుమార్ కు, అలానే అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సాధించింది. వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని అంటేనే ఎక్స్పెక్టేషన్స్ అన్ని హై రేంజ్ లో ఉంటాయి. ఎందుకంటే వీరిద్దరూ ఆర్య సినిమాతో సృష్టించిన సెన్సేషన్ మాటల్లో చెప్పలేనిది. ఇప్పటికీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన క్రేజీ లవ్ స్టోరీస్ ప్రస్తావన వస్తే ఆర్య సినిమా పేరు కచ్చితంగా వినిపిస్తుంది.

గంగోత్రి సినిమాతో పరిచయమైన అల్లు అర్జున్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చిన సినిమా మాత్రం ఆర్య. గంగోత్రి సినిమా హిట్ అయినా కూడా ఆ క్రెడిట్ మొత్తం రాఘవేంద్రరావు ఖాతాలో పడిపోయింది. ఇక అల్లు అర్జున్ కి గుర్తింపు సాధించిన సినిమా అంటే మాత్రం ఆర్య. ఆ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫామెన్స్ చాలామందిని ఆకట్టుకుంది. అల్లు అర్జున్ మినహాయిస్తే ఇంకెవరూ చేయలేరు అనే విధంగా పర్ఫామెన్స్ చేశాడు. ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. మళ్లీ హ్యాట్రిక్ కాంబినేషన్ గా వచ్చిన పుష్ప మాత్రం ఇండియన్ సినిమాకు రాజమౌళి తర్వాత ఒక గౌరవాన్ని తీసుకొచ్చింది.

ఇప్పుడు మీరు కాంబినేషన్లో పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప ది రూల్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 15 రిలీజ్ అవుతుంది అని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి రెండు పాటలను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కానీ ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ కొంచెం షూటింగ్ పెండింగ్ ఉండటం వలన సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఇక డిసెంబర్ 6 తర్వాత కూడా సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ గా మారాయి. సుకుమార్ కి అల్లు అర్జున్ కు మధ్య విభేదాలు కూడా వచ్చాయి అంటూ వార్తలు వినిపించాయి.

- Advertisement -

Pushpa 2

అయితే వీటన్నింటికీ ఒక స్పీచ్ తో సమాధానం చెప్పాడు అల్లు శిరీష్. ఫిలింనగర్ లో పుష్ప సినిమా గురించి ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి అని మా మేనేజర్ చెప్పినప్పుడు నాకు ఏదోలా అనిపించింది. పుష్ప సినిమాను సుకుమార్ చాలా అద్భుతంగా చెక్కుతున్నాడు. ఆ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా మళ్లీ ప్రభంజనం సృష్టిస్తుంది అంటూ అల్లు శిరీష్ బడ్డీ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో మాట్లాడాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు