Amala Paul: హేమా కమిటీ నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది.. అసలేమైందంటే..?

Amala Paul.. మలయాళ సినీ ఇండస్ట్రీలో నటీమణులు ఎక్కువగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జస్టిస్ హేమా కమిటీ నివేదిక సమర్పించగా అందులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మలయాళ సినీ ఇండస్ట్రీలో ఉండే ఆడవారు ఎన్నో రకాలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని అవకాశం కావాలి అంటే పడుకోవాల్సిందే అంటూ కొంతమంది డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలు వారిని ఇబ్బంది పెడుతున్నారు అంటూ హేమా తన కమిటీలో వెల్లడించింది.

Amala Paul: Hema committee shocked me.. What happened..?
Amala Paul: Hema committee shocked me.. What happened..?

అన్ని ఆర్గనైజేషన్స్ లో మహిళలు 50 శాతం ఉండాలి..

అయితే ఈ రిపోర్టు బయటికి రావడంతో అమ్మ సంస్థ పాలకమండలిని రద్దు చేశారు. దీంతో చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పందించి ఎంతోమంది తమకు జరిగిన చేదు సంఘటనలను కూడా గుర్తు చేసుకున్నారు. అయితే తాజాగా హేమా కమిటీ నివేదిక తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రముఖ స్టార్ హీరోయిన్ అమలాపాల్ వెల్లడించింది. స్టార్ ఆర్గనైజేషన్ తో సహా మహిళలు సారథ్యం వహించాలని , ప్రతి రంగంలో 50% మహిళలు కచ్చితంగా ఉండాలని ఆమె కోరింది.

నటులపై కేస్ ఫైల్..

కొచ్చిలో మీడియాతో మాట్లాడిన అమలాపాల్ WCC చాలా బాగా చేశారు. లైంగిక ఆరోపణలకు చట్టపరమైన న్యాయం జరగాలని అమలాపాల్ తెలిపారు. అదే సమయంలో సినీ పరిశ్రమ నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఎక్కువయ్యాయని ఆమె తెలిపారు. దీంతో పోలీసులు నటులు ఎవల బాబు , సుధీష్ లపై కేసు నమోదు చేశారు. కోలీవుడ్ కు చెందిన ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేయడం జరిగింది. అమ్మ సంస్థలో సభ్యత్వం కావాలి అంటే కాంప్రమైజ్ కావాలని అడిగారని ఎవల బాబుపై ఫిర్యాదు కూడా చేశారు. అలాగే నటుడు సుదీష్ దుర్భాషలాడారు అంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతో లైంగిక వేధింపుల కింద సెక్షన్ 364 ఏ కే కింద కేసు నమోదు చేయడం జరిగింది.

- Advertisement -

శ్రీ కుమార్ మీనన్ పై సెక్షన్ 354 కింద కేస్ ఫైల్..

అదే సమయంలో మరో జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదుతో దర్శకుడు శ్రీ కుమార్ మీనన్ పై కూడా పోలీసుల కేసు నమోదు చేసినట్లు సమాచారం. హోటల్లో దర్శకుడు తనను వేధించాడని ఆ మహిళ ఆరోపించింది శ్రీ కుమార్ మీనన్ పై మారడ్ పోలీసులు కేసు నమోదు చేసి ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు ఫైల్ చేశారు. ఆ జూనియర్ ఆర్టిస్టు మాట్లాడుతూ ఒక అడ్వర్టైజ్మెంట్లో ఛాన్స్ ఇస్తానని చెప్పి కొచ్చిలో ఉన్న ఒక హోటల్ కి పిలిపించి చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేసింది.

దర్శకుడు రంజిత్ పై కూడా కేసు నమోదు..

అంతేకాదు దర్శకుడు రంజిత్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మంగావ్ కు చెందిన ఒక యువతి ఫిర్యాదు మేరకు రంజిత్ పై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో బెంగాలీ నటి కూడా ఫిర్యాదు చేయగా, అన్ని కేసులు ఇప్పుడు రంజిత్ పై పడ్డాయి. ఇప్పటికే చాలామంది నటీమణులు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొస్తుంటే పోలీసులు రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు