Kalki 2898AD : 39 ఏళ్ల తర్వాత ‘క‌ల్కి’తో ఆ ఫీట్ రిపీట్..!

Kalki 2898AD : సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా కల్కి ..ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మేనియా కొనసాగుతుంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ , సక్సెఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీగా ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది.. భారత పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే ‘కల్కి’ అవతారాన్ని ఈ సినిమాలో చూపించారు నాగ్ అశ్విన్.. నాలుగున్నర ఏళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..

ఈ సినిమా విడుదలకు ముందు భారీ క్రేజ్ ను అందుకున్న సంగతి తెలిసిందే .. థియేటర్లలోకి వచ్చిన తర్వాత కూడా సక్సెస్ టాక్ ను అందుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.. ప్రస్తుతం అందుకున్న టాక్ తో సినిమా బ్లాక్ బస్టర్ అనే వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..  ఈ మూవీలో లెజండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ లు నటించారు. అయితే వీరిద్దరూ కలిసి దాదాపు 39 ఏళ్ల క్రితం స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. 1985లో హిందీలో వ‌చ్చిన ‘గిర‌ఫ్తార్’ మూవీలో అమితాబ్, క‌మ‌ల్ క‌లిసి న‌టించారు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ‘క‌ల్కి’ సినిమాలో వారిద్ద‌రు క‌లిసి నటించ‌డం విశేషం.. అశ్వర్థామ పాత్రలో అమితాబ్ నటించగా , సుప్రీం యాస్కిన్‌ పాత్రలో క‌మ‌ల్ హాసన్ పాత్రలో నటించారు..

amitab bachchan to kamal haasan share screen after 39 years in kalki movie
amitab bachchan to kamal haasan share screen after 39 years in kalki movie

ఈ సినిమాలో వీరిద్దరు కీలక పాత్రల్లో నటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా భారీ విజయాన్ని అందుకోవడానికి వీరిద్దరు ముఖ్యం అని సినీ అభిమానులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని, రాజేంద్ర ప్ర‌సాద్, శోభ‌న త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజంతి మూవీస్ నిర్మించగా, నారాయ‌ణ‌న్ సంగీతం అందించారు.. మొత్తానికి సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు